సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా గొడవ: దాడి, ఒకరి మృతి
అనంతపురం: అనంతపురం జిల్లా మడకశిర సమీపంలోని కర్ణాటక రాష్ట్రం తుమకూరు జిల్లా పావగడ పట్టణంలోని అలంకార్ థియేటర్‌లో శుక్రవారం విషాద సంఘటన జరిగింది. రెండు వర్గాలకు చెందిన యువకుల మధ్య జరిగిన ఘర్షణలో రాకేశ్ నాయక్(20) అనే డిగ్రీ విద్యార్థి మృతిచెందాడు.
పావగడ సీఐ వెంకటేశ్ అందుకు సంబంధించిన వివరాలు అందించారు. పట్టణానికి చెందిన రాకేశ్ నాయక్ పవన్‌కల్యాణ్ నటించిన సర్దార్ గబ్బర్‌సింగ్ సినిమా చూసేందుకు తన మిత్రులతో స్థానిక అలంకార్ థియేటర్‌కు వచ్చాడు. సినిమా చూస్తున్న సమయంలో పవన్ కల్యాణ్‌పై వేరే వర్గంవాళ్లు వ్యాఖ్యలు చేశారు.

దాంతో రాకేశ్‌నాయక్ వర్గం వారితో ఘర్షణ పడింది. దీంతో ఇరు వర్గాల వారు కత్తులతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ ఘర్షణలో రాశేక్‌నాయక్ అక్కడికక్కడే మృతి చెందాడు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ తెలిపారు.
రవి అనే వ్యక్తి నెయిల్ కట్టర్‌కు ఉండే చిన్నపాటి చాకుతో రాకేష్ మెడపై పొడిచినట్లు తెలుస్తోంది. దీంతో ప్రధాన నరం తెగిపోయి రాకేష్ మృతి చెందినట్లు సమాచారం. రాకేష్‌ను వెంటనే ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. పోలీసులు రవిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ స్థితిలో థియేటర్‌లో సినిమా ప్రదర్శనను నిలిపేశారు.
-
పవన్ Vs విజయ్, మమత- చంద్రబాబు : ఆ రెండు రాష్ట్రాల్లో మోదీ బిగ్ టాస్క్..!? -
దివ్యాంగులకు అండగా "పెద్ది" సినిమా నిర్మాత వెంకట సతీష్ కిలారు..! -
'బైకర్' ట్రైలర్ రిలీజ్.. శర్వానంద్ ఈసారి హిట్ కొట్టేశాడోచ్..! -
దయచేసి నన్ను సినిమాల్లో పెట్టుకోండి: రాజశేఖర్ రిక్వెస్ట్ -
'అమ్మా.. నాకు ఈ యాక్టింగ్ వద్దు!': కన్నీళ్లు పెట్టుకున్న స్టార్ హీరోయిన్!! -
"మొన్న చెప్పి హిట్టు కొట్టా.. మళ్లీ చెప్తున్నా బంపర్ బ్లాక్ బస్టర్" -
తెలంగాణ గద్దర్ అవార్డుల్లో చిన్న సినిమా హవా! -
స్టార్ హీరోలున్నా.. కేవలం ఈ విలన్లవల్లే బ్లాక్ బస్టర్ అయిన సినిమాలు -
రాజకీయ దురంధురుడు చంద్రబాబు: స్టీల్ ప్లాంట్ భూమిపూజలో పవన్ కళ్యాణ్ కితాబు! -
ఉస్తాద్ భగత్ సింగ్ కాస్ట్లీ మిస్టేక్.. !! -
తెలుగులో 100 రోజులు ఆడిన సినిమాల్లో ఈ హీరోదే రికార్డు -
బన్నీ మూవీలో ఐదుగురు భామలా? అట్లీ స్కెచ్ మామూలుగా లేదుగా!











Click it and Unblock the Notifications