మహేష్ బాబు - త్రివిక్రమ్ మధ్య గొడవ ఎందుకంటే..
సర్కారు వారి పాట సినిమాతో సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులను పలకరించారు. ఈ సినిమా యావరేజ్ గా నిలిచింది. తన తర్వాత సినిమాను త్రివిక్రమ్ తో చేస్తున్న సంగతి తెలిసిందే. దీనికి గుంటూరు కారం అనే టైటిల్ ను ఖరారు చేశారు. సంక్రాంతికి విడుదల చేసేందుకు సినిమా యూనిట్ సిద్ధమవుతోంది.
ఈ సినిమా నుంచి ఓ ఖతర్నాక్ అప్ డేట్ బయటకు వచ్చింది. ఈ మాస్ స్ట్రైక్ గ్లింప్స్ 24 గంటల్లో ఏకంగా 25 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది. గ్లింప్స్ ఆల్ టైమ్ రికార్డు సృష్టించడంతో యూట్యూబ్ లో మొదటిస్థానంలో నిలిచింది. ఇప్పటికే ట్రెండింగ్ లో అదరహో అనిపిస్తోంది. కొత్త షెడ్యూల్‌ను జూన్ 7వ తేదీ నుంచి జరపాలని యూనిట్ భావించినప్పటికీ కొన్ని కారణాల వలన అది జూన్ 10వ తేదీకి వాయిదా వేశారు.

జూన్ 10 నుంచి ఎక్కడా బ్రేక్ లేకుండా అక్టోబర్ వరకు నిరంతరాయంగా త్రివిక్రమ్ షూటింగ్ చేయబోతున్నారు. సంక్రాంతికి విడుదల చేయడమనేది అధికారికంగా ప్రకటించడంతో యూనిట్ అంతా ఫుల్లు స్వింగ్ లో ఉంది. స్టార్ హీరో అక్షయ్ కుమార్ గుంటూరు కారంలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడని తెలుస్తోంది. అక్షయ్ కోసం త్రివిక్రమ్ ఒక బలమైన పాత్ర రాశాడని, అది విలన్ పాత్ర.. లేదంటే మరో పాత్రా అనేది స్పష్టత రాలేదు. ఓ యాక్షన్ సీక్వెన్స్ కోసం సారధి స్టూడియోలో ఓ భారీ సెట్ ను రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో మహేష్ బాబు పక్కన కథానాయికలుగా పూజా హెగ్డే, శ్రీలీల నటిస్తున్నారు.
ఈ సినిమా షూటింగ్ విషయంలో మహేష్ బాబు - త్రివిక్రమ్ మధ్య గొడవలు చోటు చేసుకున్నాయని సోషల్ మీడియాలో విపరీతంగా వార్తలు వచ్చాయి. త్రివిక్రమ్ విషయంలో మహేష్ బాబు చాలా అసంతృప్తిగా ఉన్నాడని, ఈ సినిమా విషయంలో మొదటినుంచి వీరిద్దరి మధ్యా క్లాషెస్ చోటుచేసుకున్నాయని పుంఖాను పుంఖాలుగా వార్తలు వచ్చాయి. పూజా హెగ్డేను హీరోయిన్ గా, మ్యూజిక్ డైరెక్టర్ గా తమన్ వద్దని మహేష్ బాబు చెప్పినప్పటికీ త్రివిక్రమ్ ఆయన్ను ఒప్పించారని, స్క్రిప్ట్ విషయంలో కూడా ఇద్దరిమధ్య ఐకమత్యం లోపించిందని తెలుస్తోంది.
దీంతో ఈ సినిమా షూటింగ్ ఆలస్యమవుతోందంటూ వస్తున్న వార్తలపై నిర్మాత సూర్యదేవర నాగవంశీ స్పందించారు. అటువంటిదేమీ లేదని, అనుకున్న సమయానికి సినిమాను విడుదల చేస్తామన్నారు. వీరిద్దరి మధ్య విభేదాల గురించి నిర్మాత కూడా స్పష్టంగా చెప్పకపోవడంతో వచ్చిన వార్తలన్నీ నిజమేననే చర్చ ఫిల్మ్ నగర్ లో ప్రారంభమైంది.












Click it and Unblock the Notifications