వైసీపీలో విభేదాలు!: ‘జై రాధా’ నినాదాలు, ‘ఆపండయ్యా’ అంటూ మల్లాది అసహనం
అమరావతి: విజయవాడలో బుధవారం నిర్వహించిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శిక్షణా తరగతుల్లో గందరగోళం నెలకొంది. నేతల మధ్య భేదాభిప్రాయాల కారణంగా ఎమ్మెల్యే వంగవీటి రాధా అనుచరులు హంగామా సృష్టించారు.
గుడివాడ, విజయవాడ సెంట్రల్ నియోవర్గ బూత్ కమిటీల సమావేశంలో వంగవీటి రాధాను ఎందుకు ఆహ్వానించలేదని ఆయన అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

జై రాధా నినాదులో...
జై రాధా, జై రంగా నినాదాలతో హోరెత్తించారు. దీంతో వైసీపీ నేత సామినేని ఉదయభాను కల్పించుకుని వారిని సముదాయించారు. ఈ శిక్షణా తరగతులకు హాజరుకావాలని రెండ్రోజులుగా వంగవీటి రాధాను ఆహ్వానిస్తున్నామని చెప్పారు.

కాసేటికే వచ్చిన రాధ
రాధ వస్తారని చెప్పడంతో ఆయన అనుచరులు శాంతించారు. కాగా, ఈ తతంగం జరిగిన కొంతసేపటి తర్వాత రాధా అక్కడికి వచ్చారు. అయితే, ఈ సమావేశానికి వైసీపీ నేత మల్లాది విష్ణు కూడా హాజరయ్యారు.

వేదికపైకి రాని మల్లాది
వేదికపైకి రావాలంటూ విష్ణును ఆహ్వానించినప్పటికీ ఆయన వెళ్లలేదు. వైసీపీ నేతలు పెద్దిరెడ్డి, పార్థసారథి, వెల్లంపల్లి శ్రీనివాస్ కల్పించుకుని విష్ణుని వేదికపైకి రావాలని కోరినా.. ఫలితం లేకపోయింది.

‘ఆపండయ్యా' అంటూ మల్లాది అసహనం
వంగవీటి రాధా రాకకు ముందు జై రాధా, జై రంగా అంటూ అనుచరులు హోరెత్తించడంపై మల్లాది విష్ణు ఒకింత ఆసహనానికి గురైనట్లు తెలుస్తోంది. ‘ఆపండయ్యా' అంటూ మల్లాది వారిని వారించే ప్రయత్నం చేశారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications