మంత్రులు, అధికారులపై చంద్రబాబు సీరియస్ - బిగ్ టాస్క్, డెడ్ లైన్..!!

ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్ అయ్యారు. మంత్రులు.. అధికారులకు బిగ్ టాస్క్ విధించారు. ఈ టాస్క్ పూర్తి చేసేందుకు డెడ్ లైన్ ఖరారు చేసారు. ప్రతీ విషయంలో మీకు పదే పదే చెప్పాలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. అమరావతి..పోలవరం పైన ప్రభుత్వ ప్రణాళికలు స్పష్టం చేసారు. ప్రభుత్వ లక్ష్యాలను అందుకోవటం పైన అప్రమత్తంగా వ్యవహరించాలని నిర్దేశించారు. పొరుగు రాష్ట్రాలతో జల వివాదాలు కోరుకోవటం లేదని.. తెలుగు ప్రజలకు మేలు జరిగే విధంగా నిర్ణయాలు ఉండాలని చంద్రబాబు పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు మరో సారి సీరియస్ అయ్యారు. సచివాలయంలో మంత్రులు.. ముఖ్య అధికారులతో చంద్రబాబు కీలక సమావేశం ఏర్పాటు చేసారు. ప్రభుత్వ లక్ష్యాలను వివరించారు. గతంలో నిర్దేశించిన టార్గెట్స్ పైన సమీక్షించారు. ఇదే సమయంలో మంత్రులు... అధికారుల పైన ఆగ్రహం వ్యక్తం చేసారు. కార్యదర్శులు అందరూ వారివారి శాఖల్లో కేంద్ర ప్రయోజిత పథకాల నిధులు ఎందుకు ఖర్చుచేయడం లేదని ముఖ్యమంత్రి మండిపడ్డారు. ఈనెల 15 డెడ్ లైన్ అని చెప్పినా ఎందుకు ఖర్చుచేయడం లేదంటూ సీరియస్ అయ్యారు. మీకు ప్రజల సోమ్ము మురిగి పోయేలా చేసే హక్కు ఎవరిచ్చారని ప్రశ్నించారు. అసెంబ్లీ సమావేశాలు ఫిభ్రవరి మొదటి, రెండ వ వారాల్లో పెట్టి మార్చి 15కల్లా అంతా ముగించాలనుకుంటున్నట్లు వెల్లడించారు. మార్చి 15 నుండి సెక్రటరీలు ఢిల్లీ వెళ్లి డబ్బులు తెస్తారని చూస్తుంటే మీరు ఇలా చేస్తారా అంటూ సీఎం ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇలా అయితే వారానికి ఒకసారి మీటింగ్ పెట్టాలా అని మండిపడ్డారు.

cm-chandra-babu-angry-over-ministers-and-officials-fixed-big-task

ఇదే సమయంలో అందరు మంత్రులు కూడా మీ సెక్రటరీలు, విభాగాదిపతులతో కలిసి ఆలోచన చేయాలని నిర్దేశించారు. ప్రజాధనాన్ని ముగిపోయేలా చేసే హక్కు మీకు ఎవరు ఇచ్చారంటూ సీరియస్ అయ్యారు. సాఘిక సంక్షేమం, గిరిజనసంక్షేమం, మున్సిపల్ అడ్మినిష్ట్రేషన్ శాఖలలో ఉన్న డబ్బులు మీరు ఎందుకు ఖర్చుచేయలేదని ప్రశ్నించారు. మున్సిల్ అడ్మినిష్ట్రేషన్ లో 320కోట్లు ఉంటే కేవలం 120 కోట్లు ఖర్చుచేశారని పేర్కొన్నారు. ఈనెలాఖరులోగా డబ్బులన్ని ఖర్చు చేయాలి లేకపోతే మీ వెంటపడతామని తేల్చి చెప్పారు. ఈనెలాఖరుకు కేంద్ర పథకాల డబ్బులు ఖర్చుచేసి , మార్చి నాటికి అందరూ ఢిల్లీ వెళ్లి నిధులు వచ్చే విధంగా ప్రణాళికలు సిద్దం చేసుకోవాలని సూచించారు. రాజధాని అభివృద్ధిలో రైతులను భాగస్వాములను చేయడం గొప్ప విషయమని వ్యాఖ్యానించారు. అమరావతిలో త్వరలోనే క్వాంటమ్ కంప్యూటర్ ప్రారంభిస్తామని ప్రకటించారు. గోదావరి పుష్కరాలకు ముందే పోలవరం పూర్తి చేస్తామని వెల్లడించారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం నిర్మించినా అడ్డుపడలేదని ప్రస్తావించారు. తెలుగుజాతి ఒక్కటే.. అందరం కలిసి పనిచేసుకుందామని ముఖ్యమంత్రి సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+