ఇక ఆ భూములు మీ సొంతం, చంద్రబాబు కీలక ప్రకటన..!!

ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటన చేసారు. 2016 కంటే ముందు ప్రభుత్వ హౌసింగ్ స్కీంలో పట్టా పొందిన ప్రతీ ఇంటికి రిజిస్ట్రేషన్ చేయించుకునే సౌలభ్యం కల్పిస్తున్నామని వెల్లడించారు. లబ్దిదారులు క్రయవిక్రయాలకు, గిఫ్ట్ డీడ్‌లకు అవకాశం కల్పిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నాట్లు స్పష్టం చేసారు. రాష్ట్ర వ్యాప్తంగా 75 లక్షల మంది పేద కుటుంబాలకు ఈ నిర్ణయం ద్వారా లబ్ది కలుగుతుందని వెల్లడించారు. అదే విధంగా రాష్ట్రంలో ఫ్రీ హోల్డ్‌ కింద అర్హత కలిగిన 9.25 లక్షల ఎకరాలపై భూ యజమానులకు యాజమాన్య హక్కులు కల్పిస్తున్న ట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు.

భూమి అనేది కేవలం ఆస్తి మాత్రమే కాదని అది జీవనాధారమని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలోని సూరేపల్లిలో 'మీ భూమి-మీ హక్కు' కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొని భూ సమస్యల పరిష్కారంలో భాగంగా తీసుకుంటున్న నిర్ణయా లను వెల్లడించారు. సచివాలయంలోనే భూమి రికార్డులకు సంబంధించిన వివరాలను సరిచేసు కునే అవకాశాన్ని కూడా స్వర్ణవార్డు, స్వర్ణ గ్రామ కార్యాలయాల్లో చేసుకోవచ్చని చెప్పుకొచ్చారు. అదే విధంగా గ్రామాలతో పాటు పట్టణాల్లోనూ ఆటోమ్యుటేషన్ ప్రక్రియ ద్వారా మేలు జరిగేలా చూస్తు న్నామని వివరించారు. రైతులు ఇక ఎమ్మార్వో కార్యాలయాలకు రావాల్సిన అవసరం లేకుండా ఆస్తులు బదిలీ కాగానే ఇంటికే పట్టాదారు పాస్ పుస్తకం వచ్చేలా చూస్తామని ప్రకటించారు. కాగా, ఇక.. రిజిస్ట్రేషన్ ప్రక్రియలోనూ సంస్కరణల్ని తీసుకు రావాలని ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు. ఆటోమేటిక్ రిజిస్ట్రేషన్ జరిగేలా కార్యాచరణ చేపట్టాలని నిర్ణయించామని చెప్పారు.

cm-chandra-babu-announces-big-decisions-over-distribution-of-pattadar-pass-books-to-the-farmers-la

పట్టాదారు పాసు పుస్తకాలు రాజముద్రతో అందిస్తాం

రూ.10 లక్షల లోపు ఉన్న వారసత్వ భూములు రూ.100, అంతకంటే ఎక్కువ విలువ ఉన్న వారసత్వ భూములు రూ.1 వెయ్యితో రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చని చెప్పుకొచ్చారు. జాయింట్ ఎల్పీల విషయంలో వివాదాలు తెచ్చుకోవద్దని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు. 1.12 కోట్ల పట్టాదారు పాస్‌ పుస్తకాలు ఇచ్చే బాధ్యత తీసుకుంటానన్నారు. 16,816 గ్రామాలు రీ సర్వే చేయాలన్నారు. ఇప్పటికే 21.23 లక్షల కొత్త పాస్‌ పుస్తకాలు ప్రజలకు ఇచ్చామని తెలిపారు. జూలై నాటికి 9 లక్షల పాస్‌ పుస్తకాలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఇంకా 80 లక్షల పాస్‌ పుస్తకాలు ఇవ్వాలని చంద్రబాబు వివరించారు. కరెన్సీకి వాడే సాంకేతికతే పట్టాదారు పాస్‌ పుస్తకాలకు వాడామన్నారు. మీ ముందు సర్వే చేయించి రికార్డు చేస్తామని.. ఈకేవైసీ చేశాకే పట్టాదారు పాస్‌ పుస్తకం ఇస్తామని వెల్లడించారు. భూ యజమాని సమక్షంలో మొత్తం ప్రక్రియ నిర్వహిస్తున్నామని... రూపాయి కూడా అవినీతి లేకుండా పాస్ పుస్తకాలు ఇవ్వాలనేది తన లక్ష్యమని చంద్రబాబు స్పష్టం చేసారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+