టీడీపీలో కీలక నియామకాలు - చంద్రబాబు మార్క్ ఎంపిక..!!
ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటన చేసారు. తెలుగు దేశం పార్టీ నేతలు, కార్యకర్తలు ఎంతగానో ఎదురుచూస్తున్న లోక్ సభ నియోజకవర్గాల పార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులను ప్రకటించారు. సుదీర్ఘ కసరత్తు తరువాత చంద్రబాబు వీరి పేర్లను ఖరారు చేసారు. సామాజిక సమీకరణాలను.. సీనియార్టీ - విధేయత పరిగణలోకి తీసుకొని వీరిని చంద్రబాబు ఎంపిక చేసారు. కొత్తగా నియమితులైన నేతలతో చంద్రబాబు సమావేశం కానున్నారు.
టీడీపీ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులను ముఖ్యమంత్రి.. టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు ప్రకటించారు. 25 లోక్ సభ నియోజకవర్గాలకు అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు నియామకం పూర్తయింది. సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇస్తూ.. సీనియార్టీ ప్రకారం పార్టీ పదవులను ప్రకటించారు. జిల్లా అధ్యక్షుల్లో బీసీకి చెందిన వారు 8 మంది, మైనార్టీ నుంచి ఒకరు, ఓసీ నుంచి 11 మంది, ఎస్సీ నుంచి నలుగురు, ఎస్టీ నుంచి ఒకరు ఉన్నారు. అదే విధంగా పార్టీ ప్రధాన కార్యదర్శులను ఎంపిక చేసారు. అనకాపల్లి అధ్యక్షుడిగా బత్తుల తాతయ్య బాబు.. ప్రధాన కార్యదర్శిగా లాలం కాశి నాయుడును ప్రకటించారు. అదే విధంగా అరకు కు తేజోవతి - దత్తి లక్ష్మణరావును నియమించారు.

కాగా, శ్రీకాకుళం అధ్యక్షుడిగా మోదవలస రమేశ్ - ప్రధాన కార్యదర్శిగా పేరికట్ల విఠల్ రావు పేర్లను ప్రకటించారు. విశాఖ కు చోడే వెంకట పట్టాభిరాం - లోడగ క్రిష్ణ, విజయనగరం కు కిమిడి నాగార్జున - ప్రసాదుల వర ప్రసాద్, అమలాపురం కు గుత్తల సాయి- పాలం రాజు, ఏలూరు అధ్యక్షుడిగా బడేటి రాధాక్రిష్ణ - ప్రధాన కార్యదర్శిగా ముత్తారెడ్డి జగ్గవరపు ను నియమించారు. ఇక.. కాకినాడకు జ్యోతుల నవీన్ - పెంకే శ్రీనివాస బాబు, నర్సాపురం కు మంతెన రామరాజు - పితాని మోహన రావు, రాజమండ్రికి బొడ్డు వెంకట రమణ చౌదరి - కాశీ నవీన్ నియమితులయ్యారు. ఇక.. బాపట్ల అధ్యక్షుడిగా సలగల రాజశేఖర్ బాబు - ప్రధాన కార్యద్శిగా నక్కల రాఘవ ను ప్రకటించారు. గుంటూరుకు పిల్లి మాణిక్య రావు - పోతినేని శ్రీనివాస రావు, మచిలీపట్నం కు వీరంగి గురు మూర్తి - గోవు సత్యనారాయణ పేర్లు ఖరారు చేసారు.
నర్సారావు పేట అధ్యక్షుడిగా షేక్ జానే సైదా, ప్రధాన కార్యదర్శిగా నల్లపాటి రామచంద్ర ప్రసాద్ నియమితులయ్యారు. విజయవాడకు గద్దే అనురాధ - చెన్నుబోయిన చిట్టిబాబు, చిత్తూరుకు షణ్ముగ రెడ్డి- వై సునీల్ కుమార్ చౌదరి, నెల్లూరుకు బీదా రవిచంద్ర- చేదెర్ల వెంకటేశ్వర్లు రెడ్డి, ఒంగోలు కు ఉగ్రనరసింహా రెడ్డి- కొటారి నాగేశ్వరరావు, రాజంపేటకు సగవాసి ప్రసాదబాబు - పటాన్ ఖాదర్ ఖాన్, తిరుపతికి పనబాక లక్ష్మీ - డాలర్ దివాకర్ రెడ్డి, అనంతపురంకు పూలా నాగరాజు- జీ శ్రీధర్ చౌదరి, హిందూపురంకు ఎంఎస్ రాజు - హనుమప్ప, కడపకు చదిరిరాళ్ల భూపేష్ సుబ్బరామిరెడ్డి - వైఎస్ జిబిఉల్లా, కర్నూలుకు క్రిష్ణమ్మ- పూలా నాగరాజు యాదవ్, నంద్యాల కు గౌరు చరితా రెడ్డి- ఎన్ఎండీ ఫిరోజ్ పేర్లు ప్రకటించారు.












Click it and Unblock the Notifications