మరో ఎన్నికల హామీ అమలుకు చంద్రబాబు నిర్ణయం..!!
ఏపీ లో కూటమి ప్రభుత్వం మరో హామీ అమలు దిశగా కసరత్తు చేస్తోంది. ఈ మేరకు చంద్రబాబు స్పష్టత ఇచ్చారు. అధికారంలోకి వస్తే సూపర్ సిక్స్ హామీలతో పాటుగా వర్క్ ఫ్రమ్ విధానం అందు బాటులోకి తీసుకొస్తామని నాడు హామీ ఇచ్చారు. ఇప్పుడు ప్రభుత్వంలో సంస్కరణల్లో భాగంగా మహిళలకు వర్క్ ఫ్రంహోమ్ విధానం అమలు దిశగా పెద్ద ఎత్తున ప్రణాళికలు అమలు చేస్తు న్నట్లు చంద్రబాబు వెల్లడించారు. ప్రతీ మండలంలో ఐటీ కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు ఆసక్తి కర ప్రకటన చేసారు. రాష్ట్రంలో మహిళలకు వర్క్ ఫ్రమ్ హోం విధానాన్ని ప్రారంభించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వెల్లడించారు.స్టెమ్ కోర్సు మహిళలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం, సైన్స్ రంగంలో విజయాలు సాధిస్తున్న మహిళలకు అభినందనలు తెలిపారు. స్టెమ్ కోర్సు రంగాల్లో వృద్ధి అవకాశాలను కల్పించేందుకు కూటమి ప్రభుత్వం నుంచి అవసరమైన నిర్ణయాలు తీసుకుంటామని పేర్కొన్నారు. కొవిడ్ అనంతర పరి ణామాలు, అందుబాటులో ఉన్న సాంకేతికత ద్వారా వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రాముఖ్యత పెరిగింద ని చంద్రబాబు వివరించారు.

అందులో భాగంగా రిమోట్ వర్క్, కోవర్కింగ్ స్పేస్, నైబర్ హుడ్ వర్క్ స్పేస్ వంటి కాన్సెప్టులు అనువైన ఉత్పాదక వాతావరణాన్ని సృష్టిస్తాయని చంద్రబాబు పేర్కొన్నారు. ఇవి వ్యాపారులు, ఉద్యోగులకు సమర్ధవంతమైన ఫలితాలు అందిస్తాయని విశ్లేషించారు. ఇవి భవిష్యత్ లో మెరుగైన పని, జీవిత సమతుల్యతను సాధించడంలో సహాయపడతాయని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఐటీ, జీసీసీ పాలసీ 4.0 ఆ దిశగా గేమ్ ఛేంజర్ కానుందని చంద్రబాబు వెల్లడించారు. ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి నగరం, పట్టణం, మండలంలో ఐటీ కార్యాలయాల ఏర్పాటుకు శ్రీకారం చుడుతు న్నామని స్పష్టం చేసారు. అందుకు తగ్గ ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు ప్రకటించారు.












Click it and Unblock the Notifications