కేంద్రానికి చంద్రబాబు కీలక ప్రతిపాదన..!!
ఏపీలో ఇప్పుడు మిర్చి ధర అంశం రాజకీయ చర్చగా మారింది. మాజీ సీఎం జగన్ గుంటూరులో మిర్చి యార్డును సందర్శించారు. మిర్చి ధర లేకపోవటం పైన ఆందోళన చెందుతున్న రైతులను పరామర్శించారు. మార్కెట్ స్థితి గతుల పైన ఆరా తీసారు. ప్రభుత్వం పైన విమర్శలు చేసారు. దీనికి కౌంటర్ గా మంత్రులు స్పందించారు. ఇప్పుడు సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన వేళ ఇదే అంశం పైన కీలక ప్రతిపాదన చేసారు. కేంద్రం స్పందన ఏంటనేది కీలకంగా మారుతోంది.
కేంద్రానికి ప్రతిపాదన
మిర్చి ధర పైన మాజీ సీఎం జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసారు. ప్రభుత్వం తాము మిర్చి రైతుల కోసం తీసుకుంటున్న చర్యలను వివరిస్తోంది. ఇప్పుడు తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు తన ఢిల్లీ పర్యటనలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో భేటీకి నిర్ణయించారు. దీనికి ముందే మిర్చి రైతులను ఆదుకునేలా చర్యలు చేపట్టాలని కోరుతూ చౌహాన్‌కు సీఎం చంద్రబాబు లేఖ రాశారు. మార్కెట్ జోక్యం ద్వారా తగ్గిన ధరను భర్తీ చేసేలా చూడాలని లేఖలో పేర్కొన్నారు. సాగు వ్యయానికి విక్రయ ధర మధ్య వ్యత్యాసాన్ని గుర్తించాలన్నారు. ఈ లేఖలో గత పదేళ్ల కాలంలో మిర్చి ఉత్పత్తి.. ధరల గురించి చంద్రబాబు వివరించారు.

కేంద్రమే కొనుగోలు చేయాలి
ఆర్ధిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఏపీలోని మిర్చి రైతులను ఆదుకోవాల్సిందిగా లేఖలో పేర్కొ న్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్రం వెంటనే మిర్చిని కొనుగోలు చేయాలని అభ్యర్ధించారు. మార్కె ట్ ఇంటర్వెన్ష న్ స్కీమ్ కింద వెంటనే మిర్చిని కొనుగోలు చేయాలని కోరారు. మిర్చి రైతుల పరిస్ థితి, మార్కెట్‌లో ధరల పతనంపై ఈ నెల14 వ తేదీన ఢిల్లీలో జరిగిన సమావేశం వివరాలను లేఖలో పేర్కొన్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలను కూడా సమర్పించిందని వివ రించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా మార్కెట్ ఇంటర్వేన్షన్ పథకం కింద మొత్తం వ్యయంను కేంద్రమే భరించాలని సీఎం కోరారు.
చౌహాన్ తో భేటీ
ఈ యేడాది మిర్చి విస్తీర్ణం పెరిగి ఉత్పత్తి కూడా అధికంగా ఉందని తెలిపారు. గతంలో ప్రత్యేక వెరైటీ మిర్చి క్వింటాల్ 20 వేల రూపాయలు ఉండగా నేడు ఆ ధర 13 వేలకు పడిపోయిందని పేర్కొన్నారు. సాధారణ రకం మిర్చి క్వింటాల్‌కు 11 వేల రూపాయలకు పడిపోయిందని వివరిం చారు. పలు దేశాలకు ఎగుమతి తగ్గడం వలన ఈ పరిస్థితి నెలకొందని వెల్లడించారు. రైతులు ధరలు పడిపోవడం వలన తీవ్ర ఆర్థిక నష్టాలకు గురవుతున్నారన్నారు. వెంటనే కేంద్ర మార్కెట్ ఇంటర్వేన్షన్ పథకం కింద కొనుగోళ్లు ప్రారంభించి రైతులను ఆదుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు లేఖలో కోరారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రిని స్వయంగా కలవాలని చంద్రబాబు నిర్ణయించారు.
-
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
ఏపీ, తెలంగాణలో జనగణన - ఇవ్వాల్సిన వివరాలు, మార్గదర్శకాలు..!! -
ఏపీలో ఏకీకృత పెన్షన్ పథకం మార్గదర్శకాలు జారీ..! ఈ ఉద్యోగులకు..! -
End of Naxalism : ఆంధ్రప్రదేశ్‌లో ముగిసిన ఎర్రజెండా శకం.. -
AP Govt: ఏపీలో ఇవాళ 2.5 లక్షల మందికి ఇళ్లు-టిడ్కో లబ్దిదారులకూ..! -
ఇంటర్ మూల్యాంకనం పూర్తి, ఫలితాల డేట్ ఫిక్స్ - ఏపీ.. తెలంగాణలో ఇలా..!! -
ఏపీ ప్రజలకు రూ.11వేలు రాయితీతో ఈ సైకిళ్లు, మిస్ చేసుకోకండి -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..!












Click it and Unblock the Notifications