'తల్లికివందనం' కు అర్హతల పై చంద్రబాబు కీలక ప్రకటన..!!

ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటన చేసారు. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం 2025-26 వార్షిక బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశ పెట్టింది. ఈ బడ్జెట్ లో సూపర్ సిక్స్ లో రెండు కీలక పథకాలకు నిధులు కేటాయించారు. తల్లికి వందనం పథకం కోసం నిధులు ప్రతిపాదించారు. విద్యార్ధుల సంఖ్య మేరకు కేటాయింపులు చేయలేదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఈ సమయంలో సీఎం చంద్రబాబు తాజాగా స్పష్టత ఇచ్చారు. పథకం అమలు ముహూర్తం తో పాటుగా ఇంట్లో ఎంత మంది పిల్లలకు అమలు చేస్తారనే అంశం పైన సందేహాలకు సమాధానం చెప్పారు.

తల్లికి వందనం పై క్లారిటీ
ఏపీలో కూటమి నేతలు తాము అధికారంలోకి వస్తే తల్లికి వందనం ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి తల్లి ఖాతాల్లో రూ 15 వేలు చొప్పున జమ చేస్తామని హామీ ఇచ్చారు. ఇక, అధికారంలోకి వచ్చిన తరువాత ఇప్పుడు తాజా బడ్జెట్ లో ఈ మేరకు నిధులు కేటాయించారు. మే నెలలో ఈ పథకం అమలు చేస్తామని ముఖ్యమంత్రి స్పష్టత ఇచ్చారు. గంగాధర నెల్లూరులో పెన్షన్ల పంపిణీలో పాల్గొన్న చంద్రబాబు ఎంత మంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం కింద సాయం చేస్తామని మరోసారి స్పష్టం చేశారు. పిల్లల ఖర్చుల బాధలు తగ్గించే బాధ్యత తామే తీసుకుంటామన్నారు. మే నెలలో తల్లికి వందనం ఇస్తామని ప్రకటించారు.

CM Chandra Babu clarifies over thalli ki vandanam Scheme implementation

రైతుల కోసం
త్వరలోనే రైతులకు రూ.20వేలు ఆర్థిక సాయం చేస్తామన్నారు. మత్స్యకార కుటుంబాలకు రూ.20వేల ఆర్థిక సాయం చేస్తామని తెలిపారు. ఆర్థిక సాయం చేసే వీలుంటేనే హామీ ఇస్తామని.. లేకుంటే మాయమాటలు చెప్పనని తెలిపారు. ప్రతీ ఏటా పెన్షన్ల కోసం రూ.33 వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. కుటుంబ సంబంధాలు, విలువలకు మన దేశం ప్రపంచానికే ఆదర్శమని చెప్పారు.గత ఐదేళ్ల పాటు రాష్ట్రాన్ని విధ్వంసం చేశారని మండిపడ్డా రు. ప్రజలు అన్నీ తెలుసుకొ ని కూటమి ప్రభుత్వాన్ని తీసుకువచ్చారని వ్యాఖ్యానించారు. ప్రతి నెలా ఒకటో తేదీనే ఇంటికెళ్లి పెన్షన్లు అందిస్తున్నామన్నారు. చెప్పిన ప్రతి హామీ నిలబెట్టుకునేం దుకు నిత్యం కృషి చేస్తున్నా మని వివరించారు. ప్రతి సేవా సెల్‌ఫోన్ ద్వారా అందించేందుకు శ్రీకారం చుట్టామని తెలిపారు.

రెండు నెలల కాలంలో
అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన ద్వారా పేదల జీవితాల్లో మార్పులు తెస్తామని అన్నారు. సంపద ఎలా సృష్టించాలన్న దానిపై నిత్యం ఆలోచన చేస్తున్నామన్నారు. తాము వచ్చిన 9 నెలల్లోనే 12.9 శాతం వృద్ధి రేటు సాధించామని చెప్పుకొచ్చారు. కేంద్రంతో కలిసి చేసే పనులపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు. మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చి పనులు త్వరగా పూర్తయ్యేలా కృషి చేస్తున్నామన్నారు. నాగరిక ప్రపంచంలో పారిశుద్ధ్యం చాలా అవసరమని.. మరో 2 నెలల్లో రోడ్లపై గుంతలు పూడ్చటం పూర్తవుతుందని సీఎం తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+