మారాల్సిందే, మంత్రులకు చంద్రబాబు క్లాస్ - పవన్ జోక్యంతో..!!

ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులకు మార్గనిర్దేశం చేసారు. ప్రభుత్వం ఏర్పాటై 150 రోజులు పూర్తయిందని గుర్తు చేసారు. ఇక వేగంగా పాలనా పరమైన అంశాల్లో వేగం పెరగాలన్నారు. తమ శాఖల్లో పట్టు సాధించాలని స్పష్టం చేసారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై విస్తృత ప్రచారం చేసి ప్రజల్లోకి తీసుకెళ్లాలని సీఎం సూచించారు. డిప్యూటీ సీఎం పవన్ సైతం పలు సూచనలు చేసారు.

చంద్రబాబు దిశా నిర్దేశం
మంత్రివర్గ సమావేశం తరువాత మంత్రులకు చంద్రబాబు కీలక సూచనలు చేసారు. మంత్రులకు హనీమూన్ పిరియడ్ ముగిసిందని వ్యాఖ్యానించారు. మంత్రులంతా ఇక శాఖాపరమైన అంశాలపై పట్టు సాధించాలని నిర్దేశించారు. కేబినెట్ భేటీలో అధికారిక అజెండా పూర్తయిన తరువాత రాష్ట్రం లోని ప్రస్తుత పరిస్థితి పైన జరిగిన చర్చలో మంత్రులకు సీఎం పలు సూచనలు చేసారు. రాష్ట్రం లో జరుగుతున్న అభివృద్ధి పనులపై విస్తృత ప్రచారం చేసి ప్రజల్లోకి తీసుకెళ్లాలని.. ఇందు కోసం మంత్రులు ప్రణాళికా బద్దంగా వ్యవహరించాలని సీఎం సూచించారు. అదే విధంగా అధికారులు చెప్పేవన్నీ గుడ్డిగా నమ్మొద్దని అప్రమత్తం చేసారు. తమ శాఖల్లో ఏం జరుగుతోందో వాస్తవాలు తెలుసుకోవాలని.. పూర్తి సమాచారంతోనే నిర్ణయాలు ఉండాలని నిర్దేశించారు.

CM Chandra Babu clear directions for ministers on implementation of govt decisions

అప్రమత్తంగా ఉండాలి
అధికారులు చెప్పివని మాత్రమే పరిగణలోకి తీసుకొని..వాటిని గుడ్డిగా నమ్మి బహిరంగ ప్రకటనలు చేయవద్దని చంద్రబాబు స్పష్టం చేసారు. అధికారులు చెప్పిన సమాచారాన్ని వాస్తవ పరిస్థితిని
బేరీజు వేసుకొని మాట్లాడాలని సూచించారు. తాజాగా ఇద్దరు మంత్రులు తప్పులు సరి చూసుకోకుం డా చేసిన బహిరంగ ప్రకటనల గురించి ప్రస్తావించారు. ఈ చర్చలో జోక్యం చేసుకున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక సూచనలు చేసారు. పర్యాటక, స్పోర్ట్స్ విధానాల్లో స్థానిక ప్రతిభను ప్రోత్సహించాలని సూచించారు. దీని పైన స్పందించిన లోకేష్ ఇప్పటికే వివిధ పాఠశాలల్లో క్రీడలకు సంబంధించి స్థానిక ప్రతిభను ప్రోత్సహించే చర్యలు చేపట్టామని వివరించారు.

పవన్ సూచనలు
అదే విధంగా విభిన్న ప్రతిభావంతులకు ప్రోత్సాహకాలు పెంచేలా శిక్షణ ఉంటుందని లోకేశ్​ తెలిపారు. మన సంస్కృతి, సంప్రదాయాలు పెంపొందించేలా పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేయాలని పవన్ తన అభిప్రాయం వెల్లడించారు ఉపాధి అవకాశాలు కల్పించేలా పర్యాటకాభివృద్ది జరగాలని కోరారు. తాజాగా ఎస్ఐపీబీ నిర్ణయం తీసుకున్న పరిశ్రమలు మొదలయ్యేలా చూడాలని పవన్ పేర్కొన్నారు. రేషన్ బియ్యం అక్రమార్కులపై పీడీ యాక్ట్ తరహాలో కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ సమావేశాలు మరింత రెండు రోజులు ఉండటంతో.. కీలక అంశాలను సభ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+