ఆ ఎమ్మెల్యేలకు తేల్చి చెప్పిన చంద్రబాబు, నియోజకవర్గాల్లో ఇక..!!

ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. కూటమి కలిసికట్టుగా కొనసాగాలని తేల్చి చెప్పారు. ఎమ్మెల్యేలు తప్పులు చేయవద్దని స్పష్టం చేసారు. ఎమ్మెల్యేల పని తీరు పైన నివేదికల ఆధారంగా తమ వైఖరి వెల్లడించారు. కూటమి బలం మరింత పెరిగిందని చెప్పారు. మరో 15 ఏళ్లు కూటమి కొనసాగాలని ఆకాంక్షించారు. పని తీరు బాగోలేని ఎమ్మెల్యేల తీరు పైన ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు... వారి విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కూటమి ఎమ్మెల్యేలకు తమ లక్ష్యం ఏంటో తేల్చి చెప్పారు. రాష్ట్రంలో మరో 15 ఏళ్లపాటు కూటమి ఐక్యత ఇలాగే కొనసాగాలని ఇాద్దరు నేతలు ఆకాంక్షించారు. ఈ ఇరవై నెలల్లో మూడు పార్టీల నాయకత్వంలో ఎక్కడా విభేదాలు ఏర్పడలేదని, ఇది శుభ పరిణామమని చెప్పారు. ఇకపైనా ఇదే ఐక్యత కొనసాగాలని, కింది స్థాయి వరకు ఇలాగే ఉండాలని.. అప్పుడే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. ఎన్నికల ముందు ఏ స్ఫూర్తితో పనిచేశామో, అదే స్ఫూర్తితో మున్ముందు కూడా పనిచేయాలని నిర్దేశించారు.

CM Chandra Babu decided for one to one meetings with nor perform MLA s during Assembly Sessions

మూడు పార్టీలూ ఐక్యంగా ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అడిగే పరిస్థితి ఉండాలని సూచించారు. గుజరాత్‌లో వరుసగా ఐదుసార్లు బీజేపీ గెలిచి అధికారంలో కొనసాగుతోందని గుర్తు చేసారు. అదే స్ఫూర్తితో ఇక్కడా విజయాలు సొంతం చేసుకోవాలి. శాశ్వతంగా రాజకీయాల్లో నిలబడేలా అందరూ మంచి పేరు తెచ్చుకోవాలిని నిర్దేశించారు. అసెంబ్లీ సమావేశాలను సభ్యులందరూ సీరియ్‌సగా తీసుకోవాలని, ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు సభ్యులు అంతా సభలోనే ఉండాలని స్పష్టం చేశారు.

కాగా, టీడీపీ ఎమ్మెల్యేలందరూ దాదాపు మంచి పనితీరు కనబరుస్తున్నారని చెప్పిన ముఖ్యమంత్రి చంద్బరాబు.. 40 మంది ఎమ్మెల్యేల పనితీరుపై మాత్రం అసహనం వ్యక్తం చేశారు. వారి తీరు ఆశించిన స్థాయిలో లేదని.. వారిని ఈ అసెంబ్లీ సమావేశాల సమయంలోనే వ్యక్తిగతంగా పిలిపించి మాట్లాడతానని చెప్పారు. గతంలోనూ దాదాపు 20 మంది ఎమ్మెల్యేలతో చంద్రబాబు ఒన్ టు ఒన్ సమావేశం అయ్యారు. ఆ సందర్భంలోనూ వారికి స్పష్టమైన దిశా నిర్దేశం చేసారు. ఇక.. ఇప్పటికీ మార్పు రాకపోతే వారి విషయంలో పునరాలోచన తప్పదని తేల్చి చెబుతున్నారు.

నియెజకవర్గాల్లో ఎమ్మెల్యేల పని తీరు ఎలా ఉందీ.. పార్టీ కోసం ఏం చేస్తున్నారు... కార్యకర్తలతో ఎలా ఉంటున్నారు వంటి అంశాల ఆధారంగా ఎమ్మెల్యేల తీరు పైన అంచనాకు వస్తున్నారు. అదే విధంగా.. ఇక జిల్లాల వారీగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎస్పీ, కలెక్టర్‌తో ఉమ్మడి సమావేశం నిర్వహిస్తామని.. పొలిటికల్‌ గవర్నెన్స్‌లో భాగంగా ఎమ్మెల్యేల గౌరవాన్ని పెంచుతామని సీఎం చెప్పారు. నియోజకవర్గాల్లో పెండింగ్‌ పనులు గుర్తిస్తే ప్రాధాన్య క్రమంలో వాటిని పూర్తి చేద్దామని చంద్రబాబు ప్రకటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+