బీజేపీ చీఫ్ రిక్వెస్ట్ కు చంద్రబాబు అంగీకారం, అనూహ్య నిర్ణయం..!!
ఏపీ రాజకీయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. కూటమి నేతలు కొత్త ప్రణాళికలతో ముందుకు వెళ్లేందుకు సిద్దమయ్యారు. వైసీపీ లక్ష్యంగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా కేంద్రం పార్లమెంట్ లో ప్రతిపాదించిన మహిళా రిజర్వేషన్ల బిల్లు వీగిపోయింది. దీంతో.. కాంగ్రెస్ కూటమి లక్ష్యంగా ఎన్డీఏ నేతలు విమర్శలు చేస్తున్నారు. ఏపీలోని కూటమి పార్టీలు, వైసీపీ మహిళా బిల్లుకు మద్దతు ప్రకటించాయి. కాగా.. ఇదే సమయంలో బీజేపీ చీఫ్ నుంచి వచ్చిన రిక్వెస్ట్ మేరకు సీఎం చంద్రబాబు అనూహ్య నిర్ణయం తీసుకున్నారు.
చట్టసభల్లో మహిళ రిజర్వేషన్ బిల్లుపై ఇండియా కూటమి వైఖరిని ప్రజలకు ముఖ్యంగా మహిళల కు వివరించాలని ఎన్డీయే కూటమిలోని పార్టీల నేతలకు సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఎన్డీయే నేతలు, మూడు పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో చంద్రబాబు టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. అందులో ఏపీ బీజేపీ చీఫ్ పీవీఎన్ మాధవ్ పాల్గొన్నారు. మహిళ రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీతోపాటు ఇతర భాగస్వామ్య పక్షాల వైఖరిని ప్రజలకు వివరించాలని సీఎం చంద్రబాబును పీవీఎన్ మాధవ్ కోరారు. అందుకు సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. ఇదే సమయంలో కీలక నిర్ణయం ప్రకటించారు. రాబోయే 10 రోజుల్లో ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఈ సమావేశాల వేదికగా 'ఈ అంశం' పై చర్చిద్దామన్నారు. మహిళ రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్ మినహా అన్ని పక్షాలు సమర్థించాయని ఆయన గుర్తు చేశారు.

ప్రత్యేక అసెంబ్లీ.. బహిరంగ సభలకు నిర్ణయం
మహిళా రిజర్వేషన్ బిల్లును మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుందని వివరించారు. 2023లో మహిళా రిజర్వేషన్ బిల్లుపై మోదీ ప్రభుత్వం చట్టం చేసిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమాలు నిర్వహించేందుకు ఒక కమిటీని నియమించినట్లు సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, జనసేన పార్టీ నేత, మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ కమిటీలో ఉంటారని పేర్కొన్నారు. ఈ టెలి కాన్ఫరెన్స్‌లో పీవీఎన్ మాధవ్ మాట్లాడుతూ.. ఇప్పటికే నిడదవోలులో నిరసన ర్యాలీ నిర్వహించిన విషయాన్ని పీవీఎన్ మాధవ్ ప్రస్తావించారు. ప్రతి ఎమ్మెల్యే.. తన అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రెస్ మీట్ పెట్టి ఈ అంశాన్ని వివరించాలని నేతలకు సూచించారు. అదే విధంగా త్వరలో ఆ అంశాన్ని ప్రజలకు వివరించేందుకు మూడు ప్రాంతాలు.. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతిలో బహిరంగ సభలు ఏర్పాటు చేయాలని ఈ టెలి కాన్ఫరెన్స్‌లో కూటమి నేతలు నిర్ణయించారు.












Click it and Unblock the Notifications