ఇక మద్యం కొనాలంటే, కొత్త కండీషన్ - తప్పనిసరిగా..ప్రభుత్వం ఆదేశాలు..!!
ఏపీ ప్రభుత్వం మద్యం అమ్మకాల పైన మరో కీలక నిర్ణయం తీసుకుంది. చెల్లింపుల విషయంలో కొత్త విధానం అమల్లోకి తేవాలని డిసైడ్ అయింది. రాష్ట్ర వ్యాప్తంగా వెంటనే అమలు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. అదే విధంగా బార్ల ఏర్పాటు లో ఎదురవుతున్న సమస్యల పైన అధికారులు కీలక అంశాలను ప్రభుత్వానికి నివేదించారు. పర్మిట్ రూమ్స్ కారణంగానే కొత్త బార్ల ఏర్పాటుకు వ్యాపారులు ఆసక్తి చూపటం లేదని వివరించారు. దీంతో, సీఎం చంద్రబాబు ఎక్సైజ్ అధికారులకు కీలక దిశా నిర్దేశం చేసారు.
లిక్కర్ అమ్మకాల్లో పేమెంట్స్ పైన సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలిచ్చారు. కలెక్టర్ల సదస్సులో భాగంగా రెండో రోజు మద్యం అమ్మకాల పైన చర్చ జరిగింది. మద్యం దుకాణాల్లో వంద శాతం డిజిటల్ చెల్లింపులు అమలు చేయాలని చంద్రబాబు ఆదేశించారు. ఇలా చేయకపోవటం వలన బెల్టు షాపులు వస్తున్నాయని పేర్కొన్నారు. మనకే అవకాశం ఇచ్చి మళ్లీ నిఘా పెట్టి లేని పోని సమస్యలు తెచ్చుకుంటున్నామని వివరించారు. పూర్తిగా డిజిటల్ పేమెంట్స్ చేపట్టిన దుకాణాలకు తదుపరి కేటాయింపుల్లోనూ ప్రాధాన్యత ఇద్దామని చంద్రబాబు సూచించారు. అదే విధంగా ఎర్రచందనం అమ్మకాల పైన కీలక సూచనలు చేసారు. ఎర్రచందనం అమ్ముదాం.. ఆదాయం పెంచుకుందామని ..పరిశీలన చేయాలని పేర్కొన్నారు.

ఇక, బార్ల ఏర్పాటుకు సంబంధించి ఎదురవుతున్న ఇబ్బందుల పైన సీఎం చంద్రబాబు ఆరా తీసారు. మద్యం దుకాణాల కన్నా బార్లకు సరఫరా చేసే మద్యం ధర 16 శాతం ఎక్కువని, ఇది సమస్యగా ఉందని ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు వివరించారు. పర్మిట్ రూమ్ లకు అనుమతి ఇచ్చి ఆ తరువాత బార్ల ఏర్పాటుకు ముందుకు రావటంతో సమస్య ఏర్పడిందని మరి కొందరు అధికారులు చెప్పుకొచ్చారు. కారణాలను అన్వేషించి తన వద్దకు రావాలని.. పరిష్కారం చూద్దామని చంద్రబాబు సూచించారు. ఇక.. బార్ల దరఖాస్తులకు పొడిగించిన చివరి తేదీ ఈ రోజుతో ముగియనుంది. నేటితో దరఖాస్తుల ప్రక్రియ పూర్తి చేసి రేపు (గురువారం) లాటరీ తీయాలని ఎక్సైజ్ అధికారులు భావిస్తున్నారు. దీంతో.. ఈ సాయంత్రానికి ఎక్సైజ్ శాఖ గడువు పొడిగింపుతో ఎలాంటి స్పందన వచ్చింది.. ఏ మేర దరఖాస్తులు వచ్చాయనేది పూర్తి స్పష్టత రానుంది.












Click it and Unblock the Notifications