Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అందుకే నష్టపోయాం, ఇక - చంద్రబాబు కీలక ఆదేశాలు..!!

పార్టీ నేతలకు ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక దిశా నిర్దేశం చేసారు. ఈ నెలలో అమలు చేయబోతున్న అన్నదాత సుఖీభవ, మహిళలకు ఉచిత బస్సు పథకంపై మరోసారి నేతలకు వివరించారు. ఈ రెండు కార్యక్రమాల్లో పార్టీ నేతలు, కార్యకర్తలు అందరూ పాల్గొనాలని స్పష్టం చేసారు. ప్రభుత్వం ఇప్పటి వరకు చేసిన పనులను ప్రజలకు వివరించాలని సూచించారు. నామినేటెడ్ పదవులు సైతం త్వరలోనే విడుదల చేస్తామని ప్రకటించారు.

పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, కోఆర్డినేటర్లతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కూటమి ప్రభుత్వం చేసే ప్రతి విషయాన్ని ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లాలని స్పష్టం చేశారు. గతంలో చేసినవి చెప్పుకోలేక నష్టపోయామని చెప్పుకొచ్చారు. తనకు కార్యకర్తలే ముఖ్యమన్న చంద్రబాబు, కష్టపడి పని చేసిన వారికి త్వరలోనే పదవులు ఇస్తామని వెల్లడించారు. సింగపూర్ పర్యటన విశేషాలను సైతం సీఎం చంద్రబాబు నేతలకు వివరించారు. చెప్పిన విధంగా హామీలు అమలు చేస్తున్నామని, గత ప్రభుత్వం కంటే రెండింతలు సంక్షేమం ఇస్తున్నామని అన్నారు. లబ్ధిదారుల సంఖ్య పెరిగిందని, ఆర్థిక చేయూత పెంచామని పేర్కొన్నారు.

cm-chandra-babu-explains-govt-priorities-for-party-cadre-and-fixed-road-map

ఈ నెలలోనే అన్నదాత సుఖీభవ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తున్నామని, కష్టాలున్నా సంక్షేమం అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. అన్నదాత సుఖీభవ కోసం రూ.2,342.92 కోట్లు విడుదల చేశామన్న సీఎం, జాబితాలో పేరు లేకపోతే 155251 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. అన్నదాత బాగుంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందన్న సీఎం చంద్రబాబు, రాయలసీమలో 90 శాతం ప్రాజెక్టులు మన హయాంలో చేపట్టినవే అని గుర్తు చేశారు.

మనం చేపట్టిన ప్రాజెక్టులను గత ప్రభుత్వం నిలిపివేసిందని, వైఎస్సార్సీపీ ప్రభుత్వం రైతు భరోసా కింద రూ.12,500 అని చెప్పి రూ.7,500 మాత్రమే ఇచ్చిందని సీఎం విమర్శించారు. రైతులకు రూ.1,674 కోట్లు బకాయిలు పెడితే మన ప్రభుత్వం వచ్చాక చెల్లించినట్లు తెలిపారు. ఇప్పటికే ఎమ్మెల్యేలతో సమీక్ష నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఏమైనా లోపాలుంటే సరిచేసుకోవాలని సూచనలు ఇస్తున్నట్లు చంద్రబాబు వివరించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+