దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!!
ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుమలకు వెళ్లనున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల లో రెండు రోజులు ఉండనున్నారు. తన మనవడు దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా సీఎం చంద్రబాబు కుటుంబ సమేతంగా శుక్రవారం తిరుమలకు రానున్నారు. ఏటా లోకేశ్ కుమారుడు దేవాన్ష్ జన్మదినం రోజున వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో ఒక రోజు అన్నప్రసాద వితరణకు అయ్యే ఖర్చును టీటీడీకి విరాళంగా అందజేసి భక్తులకు అన్నప్రసాదాలను వడ్డించడం చంద్రబాబు కుటుంబానికి ఆనవాయితీగా వస్తోంది.
ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుమలకు వస్తున్నారు. మనవడు దేవాన్ష్ జన్మదినం నాడు ప్రతీ ఏటా తిరుమలలోనే ఉంటున్నారు. ఆ రోజున ప్రత్యేకంగా అన్న ప్రసాద వితరణలో స్వయంగా చంద్రబాబు కుటుంబ సభ్యులు పొల్గొంటారు. ఇందు కోసం నిత్యం వేలాది మందికి అన్నదానం చేసే వెంగమాంబ అన్నదాన ప్రసాద కేంద్రంలో ఒక రోజు మొత్తానికి అన్నప్రసాద వితరణకు అయ్యే ఖర్చు చంద్రబాబు టీటీడీకి విరాళంగా ఇవ్వనున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే 'ఒక్క రోజు అన్నప్రసాదం స్కీం'కు రూ.44 లక్షల విరాళాన్ని టీటీడీకి అందజేశారు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు దంపతులు, మంత్రి లోకేశ్ దంపతులు, దేవాన్ష్ శుక్రవారం సాయంత్రం తిరుమలకు చేరుకొని రాత్రికి బస చేసి 21తేదీన దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా శ్రీవారిని దర్శించుకుంటారు. తర్వాత అన్నప్రసాద భవనానికి చేరుకుని అన్నప్రసాద వితరణ చేయనున్నారు.

ప్రతీ ఏటా ఆనవాయితీగా
గత కొన్నేళ్లుగా ప్రతీ ఏటా దేవాన్ష్ జన్మదినం వేళ చంద్రబాబు కుటుంబం తిరుమల లో తరిగొండ వెంగమాంబ నిత్యాన్నప్రసాద వితరణకు విరాళం ఇవ్వటం ఆనవాయితీగా మార్చుకున్నారు. గతంలో రోజూ రూ.30 లక్షలు విరాళంగా ఉండేది. ఇప్పుడు ప్రస్తుతం రూ 44 లక్షలకు పెంచు తూ నిర్ణయించారు. దీంతో.. ఈ మొత్తాన్ని చంద్రబాబు కుటుంబం టీటీడీకి అందించనుంది. కాగా.. అదే సమయంలో ఆ రోజు మొత్తం వెంగమాంబ అన్నప్రసాదం జరిగే హాల్ లో బోర్డు పైన ఆ రోజు అన్నదానం కు విరాళం ఇచ్చిన వారి పేరు డిస్ ప్లే చేస్తారు. దీంతో.. ఈ సారి వెంగమాంబ నిత్య ప్రసాద భవనంలో.. టుడే డోనర్ మాస్టర్ నారా దేవాన్ష్ అనే పేరుతో ఒక్కరోజు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలకు తిరుమల ముస్తాబైంది. శ్రీవారి ఆలయంలో గురువారం ఉగాది ఆస్థానం జరుగనుంది. పంచాంగ శ్రవణం నిర్వహించాక ఉగాది ఆస్థానాన్ని పండితులు ఆలయంలోని బంగారు వాకిలిలో శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు.












Click it and Unblock the Notifications