Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఎమ్మెల్సీ అభ్యర్దులుగా ఆ ఇద్దరు - చంద్రబాబు అనూహ్య ఎంపిక..!

ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల అయింది. ఇద్దరు ఎమ్మెల్సీలు రామచంద్రయ్య..ఇక్బాల్ స్థానాలు భర్తీ చేసేందుకు ఎమ్మెల్యే కోటాలో ఈ ఎన్నిక జరగనుంది. శాసనసభలో కూటమికి 164 మంది సభ్యుల మద్దతు ఉంది. దీంతో..కొత్తగా ఎవరికి ఎమ్మెల్సీ స్థానాలు దక్కుతాయనే ఆసక్తి కనిపిస్తోంది. తాజాగా పవన్ తో చంద్రబాబు చర్చల తరువాత ఇద్దరు ఎమ్మెల్సీ అభ్యర్దుల ఖరారు పైన ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

నూతన ఎమ్మెల్సీలుగా
ఏపీలో ఇద్దరు ఎమ్మెల్సీ అభ్యర్దుల ఎంపిక ప్రక్రియ దాదాపు కొలిక్కి వచ్చింది. ఎన్నికల సమయంలో పలువురు ముఖ్య నేతలకు ఇచ్చిన హామీ మేరకు ప్రస్తుతం ఎమ్మెల్సీల భర్తీ ప్రక్రియ పైన కసరత్తు కొనసాగుతోంది. ప్రస్తుతం రెండు ఎమ్మెల్సీ అభ్యర్దుల ఎంపిక జరుగుతోంది. ఇద్దరూ ఎమ్మెల్యే కోటా కావటంతో ఏకగ్రీవంగా కూటమి నుంచి ప్రతిపాదించిన అభ్యర్దులే విజయం సాధించటం లాంఛనంగా మారింది. ఈ క్రమంలో చంద్రబాబు ఈ రెండు స్థానాలకు ఇద్దరి పేర్లను పరిశీలనలోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ పేర్ల పైన పవన్ తోనూ చర్చ జరిగగిందని తెలుస్తోంది.

CM chandra Babu finalised the two candidates for MLC Elections to announce officially

వర్మకు తొలి ఛాన్స్
పవన్ కు పిఠాపురం సీటు ఖరారు సమయంలో అక్కడ టీడీపీ ఇంఛార్జ్ గా ఉన్న వర్మకు ఎమ్మెల్సీ సీటు ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇప్పుడు ఎమ్మెల్సీల నియమాకం అవకాశం రావటంతో తొలి ఛాన్స్ వర్మకు ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించారు. ఇదే అంశం పైన పవన్ సైతం మద్దతుగా నిలిచారు. పిఠాపురంలో వర్మ మద్దతుతోనే పవన్ భారీ మెజార్టీతో విజయం సాధించారు. పవన్ గెలుపు కోసం పని చేసిన వర్మకు తొలి విడతలోనే ఎమ్మెల్సీ ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. దీంతో..వర్మ అభ్యర్దిత్వం దాదాపు ఖారారైంది.

చంద్రబాబు కసరత్తు
ఇక, రెండో స్థానం రాయలసీమ నుంచి ముస్లిం మైనార్టీ వర్గానికి ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా వైసీపీ నుంచి టీడీపీలో చేరే సమయంలో తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన మాజీ పోలీసు అధికారి ఇక్బాల్ కే మరోసారి అవకాశం ఇవ్వాలనేది చంద్రబాబు ఆలోచనగా సమాచారం. ఇక్బాల్ అభ్యర్దిత్వం ఖరారు పైన పవన్, బీజేపీ నేతలతోనూ చంద్రబాబు చర్చించిన తరువాత తుది నిర్ణయం ప్రకటించనున్నారు. వైసీపీకి సంఖ్య బలం సభలో లేకపోవటంతో...కూటమి నుంచి పోటీలో నిలబడే ఇద్దరు అభ్యర్దులు ఏకగ్రీవంగా గెలవటం లాంఛనంగా మారుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+