జగన్ పై దాడితో రాష్ట్ర ప్రభుత్వానికేం సంబంధం...ధైర్యంగా ముందుకు వెళుతున్నాం:సిఎం చంద్రబాబు
Recommended Video

అమరావతి:విశాఖ ఎయిర్‌పోర్టులో ప్రతిపక్ష నేత మీద జరిగిన దాడి గురించి తమపై దుష్ప్రచారం చేస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. జగన్‌పై ఆయన అభిమాని దాడిని రాష్ట్రప్రభుత్వానికి ముడిపెడుతున్నారని ఆయన దుయ్యబట్టారు.
అమరావతిలో సోమవారం సీఎం చంద్రబాబు నీరు -ప్రగతిపై టెలికాన్పరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంచి జరుగుతుందనే ఎన్డీఏలో చేరామని, రాష్ట్రాభివృద్ధి జరగలేదు కాబట్టే బయటకు వచ్చామని చెప్పారు. అధికారం అంటే రాజకీయం, పరిపాలన రెండూ ముడిపడివుంటాయని అన్నారు.

తాము కేంద్రంతో పొత్తు సాగించినంత కాలం రాష్ట్రంలో ఐటీ దాడులు లేవని..విడిపోయి బయటకొచ్చాక మెరుపుదాడులు జరుగుతున్నాయని సీఎం చంద్రబాబు విమర్శించారు. ప్రజల అభిప్రాయాల మేరకే ప్రభుత్వాలు పనిచేయాల్సి ఉందని వ్యాఖ్యానించారు. తన ప్రత్యర్థులను కట్టడి చేసేందుకు ప్రధాని మోడీ ప్రభుత్వ యంత్రాంగాన్ని వాడుకోవటం ధర్మవిరుద్దమని సిఎం చంద్రబాబు ధ్వజమెత్తారు.
సీబీఐలో చోటు చేసుకున్న పరిణామాలు దేశ ప్రతిష్టకే మచ్చ తెచ్చాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం సహాయ నిరాకరణ, ప్రతి పక్షం అడ్డంకులు, కుట్రలను అధిగమిస్తున్నామని, మన స్వయంకృషితో అభివృద్ధి ఆగకుండా చూశామని ఆయన వివరించారు. వినూత్న ఆలోచనలతో సత్ఫలితాలు పొందుతున్నామన్నారు. నీరు-ప్రగతి, నరేగా కన్వర్జెన్స్ అందుకు ఉదాహరణ అని చెప్పారు.
కేంద్రం, ప్రతిపక్షాలు ఒక్కటై తమ ప్రభుత్వంపై మూకుమ్మడి కుట్రలకు పాల్పడుతున్నాయని...అయినా రాష్ట్ర ప్రభుత్వం వాటిని ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. కర్నూలులో స్వైన్‌ఫ్లూ తీవ్రత పెరుగుతున్ననేపథ్యంలో యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ఆయన అధికారులకు సూచించారు.
-
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!!












Click it and Unblock the Notifications