ముఖ్యమంత్రి చంద్రబాబు విదేశీ పర్యటన, షెడ్యూల్..!!

ముఖ్యమంత్రి చంద్రబాబు విదేశీ పర్యటన ఖరారైంది. వరుసగా పలు దేశాల్లో చంద్రబాబు తన టీంతో కలిసి పర్యటించనున్నారు. ఏపీకి పెట్టబడులను ఆకర్షించటమే లక్ష్యంగా చంద్రబాబు టూర్ కు సిద్దమయ్యారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పలు సంస్థలు పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చేలా చర్చలు జరుగుతున్నాయి. నవంబర్ లో విశాఖ వేదిక గా జరిగే పెట్టుబడి దారుల సదస్సుల్లో పాల్గొనేలా ప్రముఖ వ్యాపార వేత్తలను ఆహ్వానిస్తున్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు విదేశీ పర్యటన షెడ్యూల్ ఫిక్స్ అయింది. నవంబర్ 2 నుంచి 5వ తేదీ వరకు సీఎం చంద్రబాబు బ్రిటన్ రాజధాని లండన్‌లో పర్యటించనున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు తేవడమే లక్ష్యంగా ఆయన ఈ పర్యటన చేస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా లండన్‌లోని పలువురు పారిశ్రామిక వేత్తలతో సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు గల అవకాశాలను వారికి వివరించనున్నారు. నవంబర్ 14, 15 తేదీలలో విశాఖపట్నం వేదికగా భాగస్వామ్య సదస్సు జరగనుంది. ఈ సదస్సుకు హాజరు కావాలని ఆ పారిశ్రామిక వేత్తలను సీఎం చంద్రబాబు ఆహ్వానించనున్నారు.

cm-chandra-babu-foreign-tour-schedule-finalized-to-attract-investments-in-the-state

అదే విధంగా అక్టోబర్ 22 నుంచి 24వ తేదీ వరకు సీఎం చంద్రబాబు దుబాయ్, అబుదాబి, యూఏఈలలో పర్యటించనున్నారు. విశాఖపట్నంలో జరిగే భాగస్వామ్య సదస్సుకు విదేశీ పెట్టుబడుదారులను ఆహ్వానించేందుకు ఆయా దేశాల్లో ఆయన పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా రియల్ ఎస్టేట్స్, భవన నిర్మాణం, లాజిస్టిక్స్‌తోపాటు రవాణా, ఫైనాన్స్ సర్వీసెస్, ఇన్నోవేషన్స్ రంగాల్లో పెట్టుబడుదారులను ఆయన ఆహ్వానం పలకనున్నారు. ఈ విదేశీ పర్యటనకు సీఎం చంద్రబాబు వెంట మంత్రులు టీజీ భరత్, బీసీ జనార్దన్ రెడ్డిలతోపాటు వివిధ శాఖలకు చెందిన పలువురు ఉన్నతాధికారులు వెళ్లనున్నారు. చంద్రబాబు లండన్ పర్యటనలో ఐఏఎస్ అధికారి కార్తికేయ మిశ్రాతోపాటు పలువురు అధికారుల బృందం వెళ్లనుంది. విశాఖ వేదికగా జరిగే భాగస్వామ్య సదస్సుకు వివిధ దేశాల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలను ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ఆహ్వానించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+