ఇలాంటి వారికి తొందరపడి టికెట్లు ఇస్తే ఇలాగే, బయటకు వెళ్లచ్చు - చంద్రబాబు..!!

ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేసారు. పార్టీలో గీత దాటుతున్న వారి పైన ఆగ్రహం వ్యక్తం చేసారు. చాలా మంది ఎమ్మెల్యేలు తమ వ్యక్తిగత ఇమేజ్‌తో గెలిచామని భావిస్తున్నారని.. ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. అలాంటి వారు నిరభ్యంతరంగా బయటకు వెళ్లి వ్యక్తిగతంగా పోటీ చేసి గెలవొచ్చన్నారు. ఎంపీ కేశినేని చిన్ని - కొలిపూడి శ్రీనివాసరావు వ్యవహారం లో చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడ ఎంపీ - తిరువూరు ఎమ్మెల్యే వివాదం పై సీరియస్ అయ్యారు. వారి విషయం పై కీలక ఆదేశాలు ఇచ్చారు. పార్టీ సిద్ధాంతాలపై అవగాహన లేని వారికి టికెట్లు ఇస్తే ఎలా ఉంటుందో తిరువూరులో పరిస్థితిని చూస్తే అర్థమవుతుందని వ్యాఖ్యానించారు. పార్టీ లేకపోతే వారి పరిస్థితేంటో తెలుసుకోకుండా.. పార్టీ లైన్‌ దాటి ప్రవర్తించేవారిపై కఠిన చర్యలు తీసుకోవలసిందేనని చంద్రబాబు స్పష్టంచేశారు.

CM Chandra Babu key decision over Kolikapudi - Kesineni Chinni controversy

చాలా మంది ఎమ్మెల్యేలు తమ వ్యక్తిగత ఇమేజ్‌తో గెలిచామనే భావనతో ఉన్నారని..ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. అలాంటి వారు నిరభ్యంతరంగా బయటకు వెళ్లి వ్యక్తిగతంగా పోటీ చేసి గెలవొచ్చన్నారు. పార్టీ అండ లేకపోతే వారి పరిస్థితేంటో అప్పుడు అర్థమవుతుందని చెప్పారుబయట. ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, విజయవాడ కేశినేని శివనాథ్‌ (చిన్ని)ని పిలిపించాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావును ఆదేశించారు.

ఈ ఇద్దరినీ క్రమశిక్షణ కమిటీ ముందుకు విడివిడిగా రప్పించి వివరణ తీసుకోవాలని.. దానిపై తనకు నివేదిక ఇవ్వాలని సూచించారు. విదేశీ పర్యటన ముగించుకుని వచ్చాక ఇద్దరితోనూ మాట్లాడతానని, విభేదాలు కొలిక్కిరాకుంటే కఠిన చర్యలకు వెనుకాడనని తేల్చిచెప్పారు. ఎవరైనా సరే పార్టీ టికెట్‌ ఇచ్చిన తర్వాత పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేయాలని, పార్టీ లైన్‌ దాటితే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే ఎంఎస్‌ రాజు.. భగవద్గీతపై వ్యాఖ్యలు చేశారంటూ జరుగుతున్న ప్రచారంపైనా సీఎం స్పందించారు. ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు ఆచితూచి మాట్లాడా లని.. వారు మాట్లాడే మాటలు రాష్ట్రం మొత్తం ప్రభావం చూపుతాయని చెప్పారు. కొంతమంది ఎమ్మెల్యేలు సీఎంఆర్ఎఫ్ సిఫార్సు లేఖలు కూడా ఇవ్వట్లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు.

తమ నియోజకవర్గంలో ప్రజల్ని పట్టించుకునే తీరిక కూడా ఎమ్మెల్యేలకు లేదా అని సీఎం మండిపడ్డారు. సీఎంఆర్​ఎఫ్​ లేఖలు ఇవ్వని ఎమ్మెల్యేలు జాబితా సిద్ధం చేయాలని వారితో తాను మాట్లాడతానని అన్నారు. ఇకపై వారంలో ఒక రోజు పూర్తిగా పార్టీ కార్యాలయానికే కేటాయిస్తానని తెలిపారు. మొంథా తుఫానును ధీటుగా ఎదుర్కోవటంలో ప్రభుత్వం చేసిన కృషిని పార్టీ పరంగా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లలేకపోయారని అసంతృప్తి వ్యక్తం చేశారు. వైసీపీ ఫేక్ ప్రచాలకు వాస్తవా లతో ధీటుగా బదులివ్వాలని సూచించారు. లండన్ పర్యటన ముగించుకుని వచ్చాక జిల్లా పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర కమిటీని వెంటనే ప్రకటిస్తానని వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+