అమరావతి కేంద్రంగా కొత్తగా ఇక, చంద్రబాబు కీలక ప్రకటన..!!

ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. డేటా డ్రైవెన్ గవర్నెన్స్ పై మంత్రుల తో పాటుగా అధికారులకు దిశా నిర్దేశం చేసారు.ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నదే లక్ష్యం కావాలని సూచించారు. డేటా ఆధారిత పాలన అనేది ఇప్పుడు అత్యంత కీలకమైన అంశంగా మారిందని చెప్పుకొచ్చారు. క్వాంటం కంప్యూటర్‌ను వచ్చే జనవరి నుంచే అమరావతిలో ప్రారంభించబోతున్నట్లు చంద్రబాబు వెల్లడించారు. గత ప్రభుత్వ చేసిన తప్పిదాలు చక్కదిద్దు తూ ఉన్న సమస్యల్ని ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నామని సీఎం తెలిపారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులతో కలిసి అధికారులతో వీడియో కాన్ఫిరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో కీలక సూచనలు చేసారు. రాజధాని అమరావతిలో క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ వ్యాలీ వడివడిగా రూపుదిద్దుకుంటోంది. జనవరి నుంచి ప్రారంభించనున్నట్లు చెప్పారు. డిజి లాకర్ లో ప్రతీ ఒక్కరి ఆరోగ్య రికార్డులు ఉండాలని స్పష్టం చేసారు. డేటా ఆధారిత పాలన అనేది ఇప్పుడు అత్యంత కీలకమైన అంశంగా మారిందని చెప్పుకొచ్చారు. సీఎఫ్ఎంఎస్ వ్యవస్థ ద్వారా సమర్ధంగా వనరుల్ని వినియోగించ గలుగుతున్నామని వివరించారు. 2047 విజన్ డాక్యుమెంట్ లక్ష్యాలకు అనుగుణంగా అధికారులు పనిచేయాలని కోరుతున్నామని అన్నారు. నెలవారీ, త్రైమాసిక లక్ష్యాలను ఏర్పాటు చేసుకుని ఫలితాలను సాధించాలని సూచించారు. నిర్దిష్ట ప్రమాణాలకు అనుగుణంగానే ప్రభుత్వం పౌరసేవలు అందించాల్సి ఉందని అభిప్రాయపడ్డారు.

cm-chandra-babu-key-instructions-over-implementation-of-real-time-governance-to-officials

ప్రతీ నియోజకవర్గానికి ఓ సీనియర్ అధికారి నేతృత్వంలో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి విజన్ ప్లాన్ అమలు చేస్తామన్నారు. ఆర్టీజీఎస్ ద్వారా సేకరించిన సమాచారాన్ని విశ్లేషించి ఆయా శాఖలకు అప్పగిస్తున్నామని.. దానికి అనుగుణంగానే నిర్ణయాలు వేగంగా తీసుకోవాల్సి ఉంటుందని ముఖ్యమంత్రి వెల్లడించారు. ప్రస్తుతం రియల్ టైమ్ గవర్నెన్స్ కాలం నడుస్తోందని.. సిటిజెన్ డేటా అంతా క్రోడీకరించా మని సీఎం తెలిపారు. అంగన్‌వాడీల స్థాయి నుంచే విద్యార్ధుల డేటా అనుసంధానం కావాలని అధికారులకు సూచించారు. అవేర్ ద్వారా విస్తృతమైన డేటాను సమన్వయం చేసుకుని వేగంగా నిర్ణయాలు తీసుకోవాలని తెలిపారు. డేటా లేక్ ద్వారా అన్ని ప్రభుత్వ శాఖలకు చెందిన సమాచారం ఒక్క చోటే క్రోడీకరించి నిర్ణయాలు తీసుకునే వెసులుబాటు కల్పిస్తున్నామని వెల్లడించారు.

డేటా ద్వారా రియల్ టైమ్‌లోనే అనలటిక్స్ చేసి వాటి ద్వారా తక్షణ నిర్ణయాలు తీసుకునేందుకు ఆస్కారం ఉందని చెప్పుకొచ్చారు. ప్రిడిక్టివ్ అనలటిక్స్‌కు కూడా టెక్నాలజీ ద్వారా సాధ్యం అవుతోందన్నారు. ప్రజల సంక్షేమం కోసం, పాలన కోసం భారీస్థాయిలో బడ్జెట్ వ్యయం చేస్తున్నా మని.. నిధులు వ్యయం సమర్ధంగా జరగాలని సూచనలు చేశారు. ప్రస్తుతం ఇ-ఫైల్స్ కూడా అందరికీ అందుబాటులో ఉన్నాయని.. ఎంత వేగంగా నిర్ణయం తీసుకుంటున్నారన్నదే ప్రశ్న అని అన్నారు. గతంలో ఒక్క చదువుకే కులం, స్థానికత, ఆదాయం ఇలా వేర్వేరు ధృవపత్రాలు 10 రోజులు ఆఫీసుల చుట్టూ తిరిగి తీసుకోవాల్సి వచ్చేదని గుర్తుచేశారు. ఈ పరిస్థితి అంతా మారిపోవాలని... కేంద్రం తీసుకొచ్చిన డీజీ లాకర్‌ను సమర్ధంగా వినియోగించాలని ఆదేశించారు. అందరూ అన్ని శాఖలలోని సమాచారాన్ని తెలుసుకుని దానిని గుర్తించి పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్దేశించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+