Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సంక్రాంతి వేళ చంద్రబాబు కీలక ప్రకటన- మరో హామీ అమలు..!!

ముఖ్యమంత్రి చంద్రబాబు సంక్రాంతి వేళ కీలక నిర్ణయాలు వెల్లడించారు. పండుగ సందర్భంగా పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేసారు. గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొందని.. సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాలని సూచించారు. మన ఆచారాలు, సంస్కృతి, సంప్రదాయాలను మర్చిపోతే జాతి ఉనికి ఉండదని చెప్పారు. ప్రకృతిని ప్రేమించడం, పశు సంపదను పూజించే పండుగ సంక్రాంతి అని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో కీలక అంశాలను ప్రస్తావించారు

ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ నేతలతో టెలికాన్ఫిరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలోని ప్రతి పల్లె పండుగ శోభతో కళకళలాడుతోందని, ఇచ్ఛాపురం నుంచి కుప్పం వరకు పండుగ వాతావరణం కనిపిస్తోందని చెప్పారు. ప్రతి జిల్లాలో ఉత్సవాలు జరుగుతున్నాయని, కేరళలో పడవ పోటీలను తలపించేలా ఆత్రేయపురంలో పడవల పోటీలు, జగ్గన్నతోటలో ప్రభల ఉత్సవం అద్భుతంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర, గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో పెద్దఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని.. కడప జిల్లా గండికోటలో ఉత్సవాలు, సూళ్లూరుపేటలో ఫ్లెమింగో ఫెస్టివల్ జరుగుతున్నాయని తెలిపారు.

CM CHandra Babu key message for party leaders on Sankranti day details here

పర్యాటక కేంద్రాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని వివరించారు. ప్రణాళికాబద్ధంగా గ్రామాలను అభివృద్ధి చేస్తున్నామని సీఎం చంద్రబాబు చెప్పారు. గ్రీన్ ఎనర్జీ పాలసీతో ప్రతి ఇంటిపై సోలార్ రూఫ్‌టాప్‌లు ఏర్పాటు చేస్తున్నామని, ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నామని తెలిపారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2025లో ప్రజల అవసరాలు తీర్చామని, 2026లో ఆకాంక్షలు నెరవేర్చాలని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చాక మెగా డీఎస్సీ, పోలీస్ రిక్రూట్‌ మెంట్, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, స్త్రీ శక్తి, ఎన్టీఆర్ భరోసా, అన్న క్యాంటీన్ వంటి పథకాలు అమలు చేశామని ముఖ్యమంత్రి వివరించారు. ధాన్యం సేకరణలో 48 గంటల్లో రైతులకు డబ్బులు చెల్లిస్తున్నామని, ఈ ఏడాది 42 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసి రూ.10వేల కోట్లు చెల్లించామని సీఎం చంద్రబాబు వివరించారు.

అధికారంలోకి వచ్చాక విద్యుత్ ఛార్జీలు తగ్గించామని, ట్రూడౌన్ విధానంతో 13 పైసలు తగ్గించామని తెలిపారు. ఏడాదిలో రెవెన్యూ సమస్యలు పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. అమరావతి, పోలవరం పనులు వేగంగా సాగుతున్నాయని, వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేసి ప్రకాశం, మార్కాపురం జిల్లాలకు నీళ్లిస్తామని చెబుతూ తాము ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటామని వెల్లడించారు. పార్టీ పరంగా పార్లమెంట్ స్థాయి వరకు పదవులు భర్తీ చేశామని, త్వరలో రాష్ట్ర కమిటీ నియామకం చేపడతామని చెప్పారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+