పైసా చెల్లించక్కర్లేదు - చంద్రబాబు కీలక ప్రకటన..!!

ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్ అయ్యారు. ప్రభుత్వం ఏ లక్ష్యంతో అయితే ఉచిత ఇసుక నిర్ణయం తీసుకుందో అది అమలు కావాలని ఆదేశించారు. వ్యక్తిగత అవసరాలకు వినియోగించే ఇసుక ఉచితంగా అందాల్సిందేనని తేల్చి చెప్పారు. వాగులు, వంకల్లో ఎవరైనా ఎక్కడైనా తవ్వి తరలించుకోవచ్చని స్పష్టం చేసారు. సంక్రాంతి నాటికి రోడ్ల మరమ్మతులు పూర్తి చేద్దామని హామీ ఇచ్చారు. ఇసుక రవాణా అడ్డుకుంటే చర్యలు తప్పవని చంద్రబాబు హెచ్చరించారు.

చంద్రబాబు ఆదేశాలు
ఉచిత ఇసుక అంశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఇసుక గురించి మంత్రులకు గట్టి హెచ్చరికలు చేసారు. ఇసుక విషయం లో పొరపాట్లు లేకుండా ఇంఛార్జ్ మంత్రులు బాధ్యత తీసుకోవాలని ఆదేశించారు. వ్యక్తిగత అవసరాలకు వాగులు, వంకల్లోని ఇసుకను ఉచితంగా తవ్వుకొని తీసుకువెళ్లడానికి అనుమతించాలని స్పష్టం చేసారు. ఎడ్ల బళ్లు, ట్రాక్టర్లతో రవాణా చేసుకోవచ్చని ... వాటిని ఎవరూ ఆపరని చెప్పిన ముఖ్యమంత్రి .. దానికి ఏ అనుమతి అక్కర్లేదని తేల్చి చెప్పారు. ఎవరికీ పైసా చెల్లించాల్సిన అవసరం లేదు. పెద్ద నదుల విషయంలో మాత్రం నిబంధనలు పాటిస్తామని చంద్రబాబు వెల్లడించారు.

CM Chandra Babu key orders on Free sand for Ministers in Cabinet meet

ఇంఛార్జ్ మంత్రులదే బాధ్యత
లారీలకు టన్నుల పరిమితి లేదన్నారు. వాటి సామర్థ్యాన్ని బట్టి అనుమతి ఇస్తామని చెప్పారు. ఇకపై ఇసుక తక్కువ ధరకు లభించాల్సిందేనని నిర్దేశించారు. పది రోజుల్లో ఈ తేడా కనిపించాలని అధికారులకు స్పష్టం చేసారు. ఎవరైనా ఇసుకను బ్లాక్‌ చేసి అధిక ధరలకు అమ్మితే ఊరుకొనేది లేదని హెచ్చరించారు. వాగులు, వంక ల నుంచి ప్రజలు ట్రాక్టర్లలో ఇసుక తీసుకువెళ్తుంటే పోలీసులు ఆపి, జరిమానా విధిస్తున్నారని మంత్రులు ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసారు. ఏ ఊళ్లో ఇసుకను ఆ ఊరివాళ్లే తీసుకోవాలన్న నిబంధన లేదన్నారు. ఉచిత ఇసుక అమలులో సమస్యలుంటే మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం తీసుకోవాలని సీఎం సూచించారు.

CM Chandra Babu key orders on Free sand for Ministers in Cabinet meet

రోడ్లకు రూ 30 కోట్లు
రాష్ట్రంలోని రోడ్ల గురించి మంత్రివర్గంలో చర్చ జరిగింది. రాష్ట్రంలో రోడ్ల మరమ్మతు పనులు నవంబరు 1 నుంచి ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందు కోసం అదనంగా కేటాయిస్తూ ముఖ్యమంత్రి నిర్ణయించారు. రోడ్ల మరమ్మతుల ప్రారంభాన్ని కూడా రాష్ట్రమంతా ఒక వేడుకలా నిర్వహించాలని పేర్కొన్నారుఎస్సీ, ఎస్టీ వర్గాల వారి గృహాలకు సౌర విద్యుత్‌ పరికరాలను ఉచితంగా అందించాలని నిర్ణయించారు. గ్రామాల్లో ఇళ్లకు ఈ పరికరాలు బిగించుకొనేలా ప్రోత్సహించి మిగులు కరెంటును వీధి లైట్లకు వాడుకొనే అవకాశం కల్పించాలని ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యా ణ్‌ సూచించారు. దీనికి సీఎం అంగీకరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+