రూటు మార్చిన చంద్రబాబు - ఇక ఫోకస్, కొత్త రూపు..!!

సీఎం చంద్రబాబు వరుస నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఏపీ కొత్త అసెంబ్లీ కొలువు తీరింది. మంత్రివర్గం, స్పీకర్ బాధ్యతలు స్వీకరించారు. ఈ నెల 24న మంత్రివర్గ తొలి సమావేశం జరగనుంది. ఇందులో భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఇదే సమయంలో చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పం పర్యటనకు వెళ్తున్నారు. గతం కంటే భిన్నంగా ఈ సారి సీఎం అయిన తరువాత తొలి పర్యటన కుప్పం నుంచే మొదలు పెట్టారు.

కుప్పం కు చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు రెండు రోజుల పర్యటన కోసం కుప్పం వెళ్తున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిగా పోలవరం...ఆ తరువాత అమరావతి సందర్శించారు. జిల్లాల పర్యటనలో తొలిగా తన సొంత నియోజవర్గం కుప్పం ఎంపిక చేసుకున్నారు. ఈ పర్యటనలో అన్న క్యాంటీన్ ప్రారంభించడంతోపాటు నియోజకవర్గ అభివృద్ధిపై సమీక్ష నిర్వహిస్తారు. చంద్రబాబు వరుసగా కుప్పం నుంచి గెలుపొందినా నియోజకవర్గానికి ఏం చేయలేదని తాజా ఎన్నికల వరకు వైసీపీ పదే పదే విమర్శించింది. ఈ సారి కుప్పం పైన చంద్రబాబు పూర్తి ఫోకస్ పెడుతున్నారు. కొత్త రూపు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

CM Chandra Babu Kuppam visit for Two days from 25th of this month

వరుస కార్యక్రమాలు
సీఎం చంద్రబాబు 25వతేదీ మధ్యాహ్నం 12:30 కు కుప్పం పీఈఎస్ మెడికల్ కాలేజీకు చేరిక మధ్యాహ్నం 1 గంటకు అన్న క్యాంటీన్ ప్రారంభం 1:30 గంటలకు ఎన్టీఆర్ విగ్రహం వద్ద బహిరంగ సభ 3:30 గంటలకు పీఈఎస్ మెడికల్ కాలేజీ ఆడిటోరియంలో జిల్లా అధికారులతో సమీక్ష సాయంత్రం 6 గంటలకు ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో కుప్పం నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశం అనంతరం అక్కడే రాత్రి బస 26వతేదీ ఉదయం 10 గంటలకు జిల్లా నేతలతో సమీక్ష చేయనున్నారు. ఉదయం 11 గంటలకు ప్రజల నుంచి వినతుల స్వీకరణ ఉంటుంది.

పూర్తి ఫోకస్
అదే రోజు మధ్యాహ్నం 12 గంటలకు శాంతిపురం మండలంలోని గుండిశెట్టిపల్లి వద్ద కాలువ పరిశీలన మధ్యాహ్నం 2 గంటల నుండి 4 గంటల వరకు పీఈఎస్ కాలేజీ ఆడిటోరియంలో నియోజకవర్గ నాయకులతో సమావేశం సాయంత్రం 4:30 గంటలకు తిరుగు ప్రయాణం కానున్నారు. మరోసారి కుప్పం నుంచి గెలిచి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు ఈ సారి తన నియోజకవర్గంలో పూర్తి స్థాయి అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజల్ను ఆకట్టుకోడానికి ప్రయత్నం చేస్తున్నారు. పార్టీ పరంగానూ నియోజకవర్గంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+