2029 వరకు కాదు, ముందుగానే - తేల్చేసిన చంద్రబాబు..!!
ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేసారు. పార్టీ ఎమ్మెల్యేలు.. నియోజకవర్గ ఇంఛార్జ్ లకు తన వైఖరి ఏంటో తేల్చి చెప్పారు. పార్టీలో గీత దాటుతున్న ఎమ్మెల్యేలకు చంద్రబాబు తాజాగా మరో హెచ్చరిక చేసారు. సక్రమంగా పని చేయకపోతే వేటు తప్పదని తేల్చి చెప్పారు. తీరు మార్చుకోవాలని పదే పదే చెప్పినా మార్పు రాని వారి విషయంలో కఠినంగా ఉండాలని డిసైడ్ అయ్యారు. కాగా.. 2029 వరకు వేచి చూడనని.. ముందుగానే నిర్ణయాలు ఉంటాయని చంద్రబాబు స్పష్టం చేసారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక దిశా నిర్దేశం చేసారు. ఎమ్మెల్యేలు, పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జు లు సక్రమంగా పనిచేయకపోతే వచ్చే ఎన్నికల వరకు వేచిచూడమి వెల్లడించారు. ఈలోపే వారికి ప్రత్యామ్నాయం చూసుకుంటామని స్పష్టం చేసారు. వేచి చూసే పక్షంలో జరగాల్సిన నష్టం జరిగిపోతోందని చెప్పుకొచ్చారు. కడపలో పార్టీ కార్యకర్తల సమావేశంలో తన వైఖరి ఏంటనేది చంద్రబాబు తేల్చి చెప్పారు. ఇప్పుడు తప్పులు చేస్తాం.. ఎన్నికల ముందు చూసుకుందామటే ఎవరూ క్షమించరని..పార్టీని శాశ్వతంగా అధికారంలో ఉంచాలనే లక్ష్యంతో ప్రణాళికలు రూప కల్పన చేసామని వివరించారు. అందులో భాగంగా నెల వారీగా నియోజకవర్గాల పై అభిప్రాయ సేకరణ చేపట్టి హెచ్చరికలు చేస్తామని చెప్పారు. మార్పు రాని పక్షంలో ప్రత్యామ్నాయం చేపడామని చంద్రబాబు స్పష్టం చేసారు.

ఇదే సమయంలో మరిన్ని కీలక అంశాలను వెల్లడించారు. పార్టీ, ప్రభుత్వం పై తరచూ అభిప్రాయ సేకరణ చేడుతున్నామని చెప్పారు. మైనార్టీల మద్దతు పెరుగుతూ వస్తుందని వివరించారు. ప్రత్యేకించి మహిళల ఆదరణ ఎక్కువగా ఉందన్నారు. ఓటర్లలో చైతన్యం తీసుకు రావాల్సిన బాధ్యత పార్టీ శ్రేణుల పై ఉందని పేర్కొన్నారు. రాయలసీమలో చేస్తున్న అభివృద్ధి గురించి వివరించాలని సూచించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 12 స్థానాలు గెలిచామని.. కొన్ని తప్పుల కారణంగా మిగిలినవి పోగొట్టుకున్నామని చెప్పారు. మంత్రి రాం ప్రసాద్ రెడ్డి పని తీరు మరింతగా మెరుగుపర్చుకోవాలంటూ ర్యాంకులను వెల్లిడించారు. తన పని తీరుపైనా ప్రజాభిప్రాయాన్ని తెప్పించుకుంటున్నానని వివరించారు. పదవులు పొందిన నేతలు సమావేశానికి హాజరు కాకపోవటం పైన ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు.. డిసెంబర్ 1వ తేదీ నుంచి పార్టీ కార్యక్రమాలు మరింత ముమ్మరం అవుతాయని ప్రకటించారు.
-
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
ఇకపై 4 గంటలేక ఆఫీసులు క్లోజ్.. షాప్స్, మాల్స్ కూడా ?? -
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
ఈ కొమ్మల మధ్య ఉన్న పచ్చని పామును చూశారా ? -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్న్యూస్ -
ఇండియాలో ఫస్ట్ టైమ్ సెల్ఫ్ క్లీనింగ్ ఏసీ.. 10 సెకన్లలోనే కూలింగ్ !!












Click it and Unblock the Notifications