మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!!
ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేసారు. ఏపీ కేబినెట్ భేటీలో అమరావతి సహా పలు కీలక అంశాల పైన చర్చించారు. యుద్దం కారణంగా ఏర్పడిన పరిస్థితులు.. రాష్ట్రంలో వంట గ్యాస్ సరఫరా పైన అధికారులు వివరించారు. ఇప్పటికే నియమించిన కేబినెట్ సబ్ కమిటీ అవసరమైన చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు. వేసవి వేళ కీలక నిర్ణయాల అమలు కు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇక, మంత్రులకు ముఖ్యమంత్రి చేసిన హెచ్చరిక ఇప్పుడు సంచలనంగా మారింది.
కేబినెట్ భేటీ వేళ ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేసారు. అధికారిక అజెండా పూర్తి చేసిన తరువాత మంత్రులతో తాజా పరిస్థితుల పైన చర్చించారు. ఏప్రియల్ 1 నుంచి 90 రోజులు పాటు జలధార కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. భూగర్భ నీటిమట్టం పెంచాల ని సూచించారు. మే 15 నుంచి కాలువలకు నీరు విడుదల చేయాలన్నారు. ఇందుకు మంత్రులు రైతులను సమాయత్తం చేయాలని సూచించారు. వెలుగొండ ఫేజ్ 1 ను ఈ ఏడాది జూన్ నాటికి పూర్తి చేస్తామని సీఎం స్పష్టం చేసారు. కృష్ణా కరకట్ట కు బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో పటిష్ట పరచాలని ఆదేశాలు ఇచ్చారు. మార్చి 16 న అన్ని జిల్లాలో పొట్టి శ్రీరాములు జయంతి కార్యక్రమం ను నిర్వహించాలని సీఎం ఆదేశించారు. ఈ కార్యక్రమం కోసం మంత్రి సవిత ఆధ్వర్యంలో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసారు. కాగా, యుద్ధం కారణంగా ప్రజలు ఇబ్బంది పడకుండా ఒక కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

ఆరు నెలలే సమయం... రిపోర్టులు సిద్దం
ఈ సబ్ కమిటీలో మంత్రులు కేశవ్, అచ్చం నాయుడు, నాదెండ్ల మనోహర్ సభ్యులుగా ఉంటారు. గ్యాస్ లేని పక్షంలో ఇండక్షన్ స్టవ్ లు కొంటున్నారని మంత్రి కేశవ్ చెప్పుకొచ్చారు. అయితే, శాఖల్లో మంత్రులు, అధికారులు పై కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ ను ఏప్రియల్ 2 వ తేదీన ఇస్తానని సీఎం చంద్రబాబు చెప్పారు. ఈ నివేదిక ఆధారంగా 2026-2027 సంవత్చరంలో పని తీరు మెరుగుపరచుకోవాలి సూచించారు. ఈ నివేదిక లో లక్ష్యాలు సాధించడం, ఫైల్స్ క్లియరెన్స్, కేంద్ర నిధులు వినియోగం, పథకాల అమలు వంటి అంశాలు రహస్య నివేదికలో ఉంటాయని వెల్లడించారు. పంచాయతీ లు మాదిరిగా జలవనరుల శాఖ కూడా నీటి పన్ను వసూలు చేయాలి రామానాయుడు కు చెప్పిన సీఎం.. మంత్రులు చేసిన పనిని మీరు మీడియా కు చెప్పుకోవడంలో ఫెయిల్ అవుతున్నారని వ్యాఖ్యానించారు. ఇప్పటివరకు ప్రభుత్వాన్ని స్థిరత్వానికి తీసుకువచ్చా మని... ఇక ఇప్పుడు టేక్ ఆఫ్ చేయాలి అని చెప్పారు. అందరూ టెక్నాలజీని ఉపయోగించుకుంటే ని నిర్దేశించారు. ఆరు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయని.. అందరు సిద్ధంగా ఉండాలి అని చెప్పిన సీఎం..ఇప్పటివరకు జరిగిన అన్ని ఎన్నికల్లో గెలిచాం అని చెప్పారు. ఇక.. ఎన్నిక ఏదైనా మనమే గెలవాలి అని చెప్పిన ముఖ్యమంత్రి స్పష్టం చేసారు.
-
మావిగన్ చర్చ వేళ సీఆర్డీఏ పరిధి పై కీలక నిర్ణయం- ఇక ఇలా..!! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
ఏపీ నూతన ఎన్నికల కమిషనర్ గా.. జగన్ బాధిత అధికారి..!? -
వీడ్ని నడిరోడ్డుపై ఉరి తీసినా తప్పులేదు.. 180 మంది బాలికలపై..!! -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
అడ్డంగా దొరికిన చంద్రబాబు? అంకెలతో తేల్చేసిన సజ్జల ..! -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!!











Click it and Unblock the Notifications