ఆయన గేమ్ ఛేంజర్- చంద్రబాబు ఆవేదన..!!

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు అర్పించారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. దేశం గొప్ప ఆర్ధిక సంస్కర్తను కోల్పోయిం దని ఆయన మరణం ఎంతో బాధాకరమని పేర్కొన్నారు. ఆయన లేని లోటు తీర్చలేనిదన్నారు. దేశానికి మన్మోహన్ అవిశ్రాంతంగా సేవలందించారని, ఆయన మరణం ఎంతో బాధాకరమని పేర్కొన్నారు. ఇప్పుడు దేశంలో అమలవుతున్న అనేక సంస్కరణలను తీసుకొచ్చిన ఘనత మన్మోహన్ కు దక్కుతుందని కొనియాడారు.

తీరని లోటు
ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ చేరుకున్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పార్ధివ దేహానికి నివాళి అర్పించారు. మన్మోహన్ తన సుదీర్ఘ ప్రస్థానంలో అనేక ఉన్నత పదవులు చేపట్టారన్నారు. అనేక ఆయా పదవులను సమర్థవంతంగా నిర్వర్తించారని కీర్తించారు. దూరదృష్టితో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారని చంద్రబాబు కొనియాడారు. గ్రామీణ ఉపాధి హామీ, ఆధార్, ఆర్టీఐ, విద్యా హక్కు చట్టం తీసుకువచ్చారని తెలిపారు. చంద్రబాబుతో పాటు కేంద్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, టీడీపీ ఎంపీలు మన్మోహన్ సింగ్ కు నివాళులు అర్పించారు.

CM Chandra Babu pays tribute to former PM Manmohan Singh at Delhi -

ప్రముఖుల నివాళులు
గురువారం రాత్రి మరణించిన మన్మోహన్‌ సింగ్ పార్థివ దేహాన్ని నేటి ఉద‌యం హాస్ప‌ట‌ల్ నుంచి ఇంటికి తీసుకొచ్చారు.. దీంతో ఆయ‌న ఇంటికి ప‌లువురు రాజ‌కీయ నేత‌లు, ఇతరులు వెళ్లి నివాళులర్పిస్తున్నారు. ముందుగా రాష్ట్రపతి ముర్ము నేటి ఉద‌యాన్నే మ‌న్మోహ‌న్ ఇంటికి వెళ్లి సింగ్ భౌతిక‌కాయంపై పుష్పగుచ్చం ఉంచి నివాళుల‌ర్పించారు. ప్రధాని మోదీ సైతం ఆయన భౌతికకాయం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి అంజలి ఘటించారు. అమిత్‌ షా, జేపీ నడ్డా సహా పలువురు కేంద్ర మంత్రులు కూడా మాజీ ప్రధానికి నివాళులర్పించారు.

సంతాప దినాలు
కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే సోనియా గాంధీ , రాహుల్‌ గాంధీ , ప్రియాంక గాంధీ వాద్రా, రాబర్ట్‌ వాద్రా మన్మోహన్ భౌతికకాయం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి అంజలి ఘటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. దేశానికి మన్మోహన్‌ చేసిన సేవలను గుర్తు చేసుకు న్నారు. మాజీ ప్రధాని అంత్యక్రియలను పూర్తి అధికార లాంఛనాలతో రేపు నిర్వహించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే వెల్లడించింది. ఇక మన్మోహన్‌ మృతికి సంతాప సూచకంగా 7 రోజుల సంతాప దినాలను ప్రకటించారు. రాష్ట్రపతి భవన్‌ సహా అన్ని ప్రభుత్వ భవనాలపై జాతీయ పతాకాన్ని సగానికి అవనతం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+