గృహప్రవేశం చేసిన చంద్రబాబు - పసందైన విందు, భువనేశ్వరి స్వయంగా..!!

ముఖ్యమంత్రి చంద్రబాబు గృహప్రవేశం వైభవంగా జరిగింది. తన సొంత నియోజకవర్గం కుప్పం లో చంద్రబాబు తన కుటుంబ సభ్యులతో కలిసి గృహప్రవేశం చేశారు. ఆదివారం తెల్లవారుజాము 4:30 గంటలకే గృహప్రవేశ పూజా కార్యక్రమాలు జరిగాయి. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు సంప్రదాయ పద్ధతిలో పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ శుభ కార్యక్రమానికి వచ్చే వారందరికీ పసందైన పలు రకాల విందు వంటకాలూ సిద్ధం చేశారు. ఈ సమయంలో భువనేశ్వరి ప్రత్యేక సందేశం ఇచ్చారు. తన జీవితంలో ఈ ఘట్టం ఎప్పటికీ నిలిచిపోతుందని చెప్పారు.

వైభవంగా
కుప్పంలో సీఎం చంద్రబాబు సొంతింటిని నిర్మించుకున్నారు. ఈ ఉదయం గృహప్రవేశం చేసారు. ఢిల్లీ పర్యటన నుంచి నేరుగా బెంగళూరు వచ్చిన చంద్రబాబు రాత్రికి కుప్పం చేరారు. ఆహ్వానాలు అందుకున్న నియోజకవర్గ ప్రజలు, టీడీపీ కార్యకర్తలు ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో హాజర య్యారు. కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం కడపల్లె పంచాయతీ పరిధిలోని శివపురం వద్ద రెండెకరాల స్థలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నూతన గృహాన్ని నిర్మించుకున్నారు. చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి శనివారం మధ్యాహ్నమే కుప్పం చేరుకుని పీఈఎస్‌ వైద్య కళాశాల అతిథి గృహంలో బస చేశారు. నూతన గృహానికి వెళ్లి, అక్కడి గృహప్రవేశ ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించారు. నారా లోకేశ్, బ్రాహ్మణి దంపతులు కుమారుడు దేవాన్ష్‌తో కలిసి శనివారం రాత్రి కుప్పం చేరుకున్నారు.

CM Chandra Babu perform house warming at Kuppam along with family members

పసందైన వంటకాలతో
గృహప్రవేశ ఏర్పాట్లు ఘనంగా జరిగాయి. సుమారు 25 వేలమందికి భోజనాల ఏర్పాట్లు చేశారు. ఇందుకు అవసరమైన ప్రత్యేకమైన షెడ్లను నూతన గృహ పరిసరాలలో నిర్మించారు. శనివారం రాత్రి ఇంటి వద్ద బంధుమిత్రులకు, వీఐపీలకు భోజనాలు చేసి వడ్డించారు. ఈ రోజు మధ్యాహ్నం వేల సంఖ్యలో జనం భోజనాలు చేయనున్నారు. వీవీఐపీ, వీఐపీ, సాధారణ గ్యాలరీలను ఇందుకోసం సిద్ధం చేశారు. శనివారం మధ్యాహ్నం నుంచే వంట ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. నారా భువనేశ్వరి దగ్గరుండి మరీ వంటకాలను సిద్ధం చేయించడమే కాక, అవసరమైన ఏర్పాట్లు చూసుకుంటున్నారు. 25 వేలమంది సాధారణ ప్రజలకు, 2 వేలమంది వీఐపీలకు భోజనాలు సిద్ధం చేస్తున్నారు. నియోజకవర్గంలోని ప్రతి కుటుంబం నుంచీ కనీసం ఒక్కరైనా గృహప్రవేశానికి వచ్చి భోజనం చేసి వెళ్లేలా ఆహ్వానం పలకాలని టీడీపీ శ్రేణులకు సూచించారు.

CM Chandra Babu perform house warming at Kuppam along with family members

అతిధుల కోసం
విందు భోజనంలో సంప్రదాయ వంటకాలు వడ్డించనున్నారు. చక్కెర పొంగలి, జిలేబి, తాపేశ్వరం కాజా, సమోసా, వెజ్ బిర్యానీ, టమోటా రైస్, రైతా, మ్యాంగో రైస్, గుత్తి వంకాయ మసాలా, మష్రూమ్ గుజ్జు కూర, బెండకాయ, బంగాళాదుంప కూరలతో పాటు వడలతో పులుసును కూడా వడ్డించనున్నారు. రైస్ తో పాటు సాంబారు, రసం, ఆవకాయ, గోంగూర పండుమిరపకాయ పచ్చడి, అప్పడం, పెరుగుతో పాటు క్యారెట్ హల్వా, ఐస్ క్రీమ్ అందరికీ అందించనున్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు గ్రామగ్రామానికి వెళ్లి ముద్రించిన పత్రికలను పంచి గృహప్రవేశానికి ఆహ్వానించారు. టీడీపీ కార్యకర్తలు, నాయకులకు సైతం ప్రత్యేక ఆహ్వానాలు అందాయి. పసుపు కుంకుమలు ఇచ్చి మరీ మహిళలను సంప్రదాయబద్ధంగా గృహప్రవేశానికి ఆహ్వానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+