సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం, మూడు రీజియన్లలోనూ ఇక..!!

ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటన చేసారు. అభివృద్ధి ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కాకుండా అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నామని స్పష్టం చేశారు. అమరావతి కేంద్రంగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నామని చెప్పారు. రైతులంతా ఒకే గొడుగు కిందకు రావాలని సూచించారు. రాజధాని రైతులకు క్యాపిటల్ గెయిన్ కోసం కేంద్ర ఆర్దిక మంత్రితో చర్చ చేసినట్లు వెల్లడించారు. అమరావతి రైతులకు ఇచ్చిన ప్రతీ హామీ నెరవేరుస్తామని చంద్రబాబు స్పష్టం చేసారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు ఆసక్తికర అంశాన్ని వెల్లడించారు. రాష్ట్రంలో మూడు ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నామని.. ఇందుకు అనుగుణంగా 3 ప్రాంతీయ జోన్లు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. టీడీపీ కార్యాలయంలో చంద్రబాబు కీలక అంశాలను ప్రస్తావించారు. అభివృద్ధి ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కాకుండా అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నామని స్పష్టం చేశారు. రాజధాని రైతులంతా ఇక ఒకే గొడుగు కిందకు రావాలని పిలుపునిచ్చారు. అమరావతి ప్రాంత అభివృద్ధి అసోసియేషన్ కింద అంతా ఒకే జేఏసీగా ఏర్పడితే వారితో సంప్రదిస్తూ అన్ని సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు.

cm-chandra-babu-says-three-regional-development-zones-will-appoint-for-all-areas-development

రాజధాని రైతులు కోరిన క్యాపిటల్ గెయిన్స్ మినహాయింపు గురించి కేంద్ర ఆర్థిక మంత్రికి వివరించామని.. కేంద్రంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారని తెలిపారు. రాష్ట్ర పరిధిలో ఉన్న సమస్యలన్నీ దశలవారీగా పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. రాజధాని అభివృద్ధి ఇక అన్ స్టాపబుల్ అని స్పష్టం చేశారు. రాజధాని చుట్టపక్కల ప్రాంతాల్లో లేఅవుట్లకు అనుమతుల సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామన్నారు.

పనుల కోసం ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లే రాజధాని రైతుల నుంచి సిబ్బంది డబ్బులు అడిగితే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. భూ త్యాగాలు చేసిన రైతుల సమస్యలు పరిష్కరిం చకుండా డబ్బులు డిమాండ్ చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. సీఆర్డీఏ అధికారులు, సిబ్బంది పై వస్తున్న ఫిర్యాదులపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాష్ట్రంలో అవినీతి నిర్మూలనకు ప్రత్యేక దృష్టి పెట్టామని తెలిపారు. త్వరలోనే ఆ దిశగా కార్యచరణ రూపొందిస్తామని ప్రకటించారు.

రైతు సమస్యల పరిష్కారంలో తొలుత కొంత గ్యాప్ వచ్చిందని.. అయితే తనతో సమావేశం తర్వాత అన్నింటిపైనా స్పష్టత వచ్చిందని వెల్లడించారు. రైతులు కూడా ఆనందంగా ఉన్నారన్నారు. రెండో దశ భూ సమీకరణ ఉపయోగాలపై రైతులకు వివరించినట్లు చెప్పారు. మునిస్పాలిటీగా అమరావతి మిగిలిపోకుండా మహానగరంగా అభివృద్ధి చెందితే ఎలాంటి ఫలితాలు ఉంటాయో రైతులు అర్థం చేసుకున్నారన్నారు. త్రిసభ్య కమిటీ నిరంతరం రైతులతో సంప్రదింపులు జరుపుతోందన్నారు. గోదావరి పుష్కరాల నాటికి పోలవరం పూర్తి చేసే దిశగా కృషి చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+