కేంద్రానికి చంద్రబాబు స్పెషల్ రిక్వెస్ట్, తక్షణమే..!!
ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రానికి కీలక ప్రతిపాదన చేసారు. తుఫాను కారణంగా ఏపీకి జరిగిన నష్టాన్ని వివరించారు. తక్షణమే ఆదుకునేందుకు సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్.. తుఫాను నష్టం అంచనా వేసేందుకు వచ్చిన కేంద్ర బృందాలో సమావేశం నిర్వహించారు. మొంథా తుపాన్ వల్ల జరిగిన నష్టాన్నిచౌహన్‌కు సీఎం చంద్రబాబు వివరించారు. వచ్చే వారం ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీని కలిసి సాయం కోరాలనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్లు సమాచారం.
ఏపీలో జరిగిన తుఫాను నష్టం పై ఏపీ ప్రభుత్వం కేంద్ర సాయం కోరుతోంది. శివరాజ్ సింగ్ చౌహాన్ తో సమావేశమైన చంద్రబాబు మైనర్ ఇరిగేషన్ కింద సాగు చేసే రైతుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం సహకారించాలని కోరారు. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీం కింద తోతాపూరి రైతులకు ఇచ్చిన మద్దతు ధరలో కేంద్ర ప్రభుత్వ వాటాను సైతం విడుదల చేయాలన్నారు. ఆ క్రమంలో కేంద్ర ప్రభుత్వ వాటా కింద ఇవ్వాల్సిన రూ.100 కోట్లను విడుదల చేయాలని కేంద్ర మంత్రిని సీఎం చంద్రబాబు కోరారు. మొంథా తుపానుతో రాష్ట్రానికి రూ.6,384 కోట్లు నష్టం వాటిల్లినట్లు రాష్ట్ర ప్రభుత్వం మధ్యంతర నివేదిక రూపొందించింది. ఇందుకనుగుణంగా ఉదారంగా ఆదుకోవాలని, తక్షణ సాయంగా రూ. 2,622 కోట్లు మంజూరు చేయాలని సీఎం చంద్రబాబు కేంద్ర బృందాన్ని కోరారు.

మొంథా తుపాను కారణంగా వాటిల్లిన నష్టంపై త్వరితగతిన నివేదిక ఇచ్చి ఉదారంగా ఆదుకునేలా సిఫార్సు చేయాలని కేంద్ర బృందాన్ని సీఎం చంద్రబాబు కోరారు. తుపాను కారణంగా ఇళ్లు, రహదారులు, విద్యుత్ స్తంభాలు, పంటలు, ఆక్వా, చేనేత రంగాలు దెబ్బతిన్నాయని అన్ని రంగాల్లో మొత్తంగా రూ.6384 కోట్ల నష్టం వాటిల్లినట్టు వివరించారు. క్షేత్రస్థాయిలో జరిపిన పరిశీలనలను సీఎం దృష్టికి తీసుకువచ్చింది. రెండు బృందాలుగా వేర్వేరు ప్రాంతాల్లో పర్యటించి తుపాను నష్టాన్ని అంచనా వేశామని వివరించింది. కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో వేర్వేరు ప్రాంతాలను సందర్శించనట్టు తెలిపింది. మొంథా తుపాను, భారీ వర్షాల కారణంగా జరిగిన నష్టంపై రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రజంటేషన్ ద్వారా కేంద్ర బృందానికి వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 443 మండలాల్లోని 3,109 గ్రామాలు మొంథా తుపాను కారణంగా ప్రభావితం అయ్యాయని ప్రభుత్వ నివేదికలో వెల్లడించింది. దాదాపు 10 లక్షల మంది తుపానుతో పాటు భారీ వర్షాలకు ప్రభావితం అయ్యారని పేర్కొంది. తక్షణ సాయంగా రూ.2,622 కోట్లు మంజూరు చేయాలని చంద్రబాబు కోరారు.
-
Amaravati: అమరావతి పేరు మార్పు..! సర్కార్ ఉత్తర్వులు జారీ..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!! -
మావిగన్ చర్చ వేళ సీఆర్డీఏ పరిధి పై కీలక నిర్ణయం- ఇక ఇలా..!! -
ఏపీ నూతన ఎన్నికల కమిషనర్ గా.. జగన్ బాధిత అధికారి..!? -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
ఏపీలో కొత్త లోక్సభ నియోజకవర్గాలు..రిజర్వేషన్లు ఇలా - ఆ స్థానాల పునరుద్దరణ, ఇవి రద్దు..!! -
అమరావతిలో క్వాంటమ్ రిఫరెన్స్ కేంద్రాల ప్రారంభం-దేశంలోనే తొలిసారి..! -
మోడీ చెప్పిన అతిపెద్ద నిర్ణయాలివేనా ? ఎంపీలకు తేల్చేసిన కేంద్రం..! -
వీడ్ని నడిరోడ్డుపై ఉరి తీసినా తప్పులేదు.. 180 మంది బాలికలపై..!!












Click it and Unblock the Notifications