ఆశలన్నీ అక్కడే - చంద్రబాబు సమర్థతకు అసలు పరీక్ష..!!
ఏపీలో కూటమి ప్రభుత్వం పది నెలల పాలన పూర్తి చేసుకుంది. కేంద్రం - ఏపీలో ఎన్డీఏ అధికారం లో ఉండటంతో.. గతం కంటే భిన్నంగా పరిస్థితి కనిపిస్తోంది. కేంద్రం నుంచి ఏపీకి పూర్తి స్థాయిలో సహకారం అందుతోంది. అయితే, ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు.. రాష్ట్రంలో ఆర్దిక పరిస్థితుల వేళ..కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. ఈ సమయంలో 16 ఆర్దిక సంఘం సిఫారసులు రాష్ట్రానికి కీలకం కానున్నాయి. ఇప్పుడు చంద్రబాబు ఆశలు అక్కడే. ఏపీకి కావాల్సినవి సాధించుకోవటం ఇప్పుడు చంద్రబాబు సమర్థతకు అసలు పరీక్షగా మారుతోంది.
స్వయంగా స్వాగతం
అమరావతికి వచ్చిన 16వ ఆర్దిక సంఘం ఎదుట సీఎం చంద్రబాబు రాష్ట్రంలోని పరిస్థితులను వివరించారు. ఆయనే స్వయంగా ఆర్దిక సంఘానికి సచివాలయంలో స్వాగతం పలికారు. రాజధా ని .. పోలవరం, బనకచర్ల ప్రాజెక్టు పైన ఫొటో ఎగ్జిబిషన్ ద్వారా వివరించారు. రాజధాని విషయంలో ప్రభుత్వ ఆలోచనలు వివరిస్తూ వీడియో ప్రదర్శించారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, అందాల్సిన ప్రత్యేక సాయం వంటి అంశాలపై ఫైనాన్స్ కమిషన్ బృందానికి సీఎం చంద్రబాబు ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రభుత్వ లక్ష్యాలు, స్వర్ణాంధ్ర విజన్ 2047, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, పెట్టుబడులకు ఉన్న అనుకూలతలు, పాలసీలను ఆర్ధిక సంఘానికి సీఎం వివరించిన ముఖ్యమంత్రి..విభజన అనంతరం రాష్ట్రం ఎదుర్కొన్న ఆర్థిక కష్టాలు, తదనంతర పరిణామాలను వివరించారు.

కేంద్ర కేటాయింపుల కోసం
రాష్ట్రం ఎదుర్కొంటున్న సవాళ్ల రీత్యా కేంద్రం అదనపు సాయం చేయాలని కోరారు. కేంద్రం కేటాయింపులు చేసేలా ప్రతిపాదనలు ఇవ్వాలని 16వ ఆర్థిక సంఘానికి సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ఆర్దిక సంఘం సిఫార్సులు రాష్ట్రానికి మేలు చేస్తాయని చెప్పుకొచ్చారు. ఏపీకి సుదీర్ఘ సముద్ర తీరం.. పెద్ద ఎత్తున పెట్టుబడులకు అవకాశం ఉందని వివరించారు. రాష్ట్రంలో పెట్టు బడుల కోసం చేస్తున్న ప్రయత్నాలను వివరించారు. పొరుగు రాష్ట్రాలకు హైదరాబాద్ వంటి రాజధాని ఉందని.. ఏపీ కి ఇంకా రాజధాని సైతం సిద్దం కాలేదని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఆర్దికంగా ఎదురవుతున్న పరిస్థితులను వివరించారు. ఆర్దిక సంఘం రాష్ట్రాన్ని ప్రత్యేకంగా పరిగణించాలని కోరారు. రాష్ట్ర పరిస్థితులను - వాస్తవాలను గుర్తించి ఏపీకి అండగా నిలవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆర్దిక సంఘాన్ని అభ్యర్ధించారు.












Click it and Unblock the Notifications