'డిప్యూటీ సీఎం' పదవి రచ్చ - హైకమాండ్ బ్రేక్, ఆ తరువాతే..!!

ఏపీలో కూటమి లో డిప్యూటీ సీఎం పదవి రచ్చ పై టీడీపీ హైకమాండ్ సీరియస్ అయింది. రెండు రోజులుగా సాగుతున్న ఈ వివాదానికి బ్రేకు వేసింది. పవన్ కల్యాణ్ తో పాటుగా లోకేష్ కు డిప్యూటీ సీఎం హోదా కల్పించాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. దీనికి కౌంటర్ గా జనసేన నేత లు సైతం స్పందిస్తున్నారు. లోకేష్ ను డిప్యూటీ సీఎం చేస్తే.. పవన్ ను సీఎం చేయాలనేది తమ అభిమతమని చెప్పుకొచ్చారు. దీంతో, ఇప్పుడు టీడీపీ హైకమాండ్ ఈ వ్యవహారం పైన నేతలకు వార్నింగ్ ఇచ్చింది. కూటమిలో చర్చించిన తరువాతనే నిర్ణయం ఉంటుందని తేల్చేసింది.

టీడీపీ నాయకత్వం ఆగ్రహం
జనసేనాని పవన్ ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్నారు. అయితే, హోం మంత్రి పైన వ్యాఖ్యలు.. తిరుపతి తొక్కిసలాట ఘటనలో పవన్ స్పందించిన తీరుతో కొత్త రాజకీయం మొదలైంది. పవన్ చేస్తున్న వ్యాఖ్యలతో ప్రభుత్వం ఆత్మరక్షణలో పడుతోందనే అభిప్రాయం టీడీపీ నేతల్లో మొద లైంది. దీంతో, నేరుగా పవన్ ను టార్గెట్ చేయకుండా.. పవన్ తో పాటుగా లోకేష్ కు డిప్యూటీ సీఎం హోదా ఇవ్వాలనే డిమాండ్ వ్యూహాత్మకంగా తెర మీదకు తీసుకొచ్చారు. అయితే, పవన్ హోదా తగ్గకుండా మరెవరికీ డిప్యూటీ సీఎం హోదా ఇవ్వకూడదని గతంలోనే నిర్ణయించారు. అయితే, ఇప్పుడు చంద్రబాబు సమక్షంలోనే పార్టీ నేతలు లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలని తమ డిమాండ్ తెర మీదకు తీసుకొచ్చారు.

CM Chandra Babu Serious over party leaders demand to elevate Lokesh as Deputy CM

సోషల్ మీడియా వార్
తిరుపతిలో తొక్కిసలాట ఘటనలో పవన్ టీటీడీ బోర్డు, అధికారులు క్షమాపణ చెప్పాలని పవన్ డిమాండ్ చేసారు. దీని పైన లోకేష్ స్పందించిన తీరు సైతం చర్చగా మారింది. పవన్ డిమాండ్ తో టీడీపీకి సంబంధం లేదని లోకేష్ వ్యాఖ్యానించారు. ఇక, తాజాగా చంద్రబాబు సమక్షంలోనే టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేసారు. దీని పైన చంద్రబాబు స్పందించ లేదు. డిప్యూటీ సీఎం పదవి పవన్ తో పాటుగా లోకేష్ కు ప్రతిపాదించటం పైన జనసైనికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవన్ ఏ విధంగా కూటమి అధికారంలోకి రావటానికి కారణమయ్యారో వివరిస్తూ పోస్టింగ్స్ పెడుతున్నారు. దీంతో, సోషల్ మీడియా వేదికగా టీడీపీ - జనసేన మద్దతు దారుల మధ్య వార్ కొనసాగుతోంది.

కూటమిలో చర్చించి
తాజాగా జనసేన నేతలు సైతం సీరియస్ గా స్పందించారు. లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలని టీడీపీ నేతలు ఎలా కోరుకుంటున్నారో.. తాము కూడా పవన్ సీఎం కావాలని కోరుకుంటున్నామని చెప్పుకొచ్చారు. దీంతో, కూటమిలో రచ్చ నియంత్రణకు టీడీపీ నాయకత్వం ముందుకు వచ్చింది. ఈ వివాదానికి ముగింపు పలకాలని ఆదేశించింది. అత్యుత్సాహం ప్రదర్శించవద్దని స్పష్టం చేసింది. ఏ నిర్ణయమైనా కూటమిలో చర్చించిన తరువాతనే ఉంటుందని తేల్చి చెప్పింది. ప్రస్తుతం సీఎం చంద్రబాబు దావోస్ పర్యటనలో ఉన్నారు. దీంతో, ప్రస్తుతం ఈ వివాదానికి తాత్కాలికంగా ఎండ్ కార్డు పడినట్లు కనిపిస్తోంది. కానీ, కూటమిలో చర్చించిన తరువాత అని చెప్పటం ద్వారా లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయటం పైన టీడీపీ ఇంకా ఆప్షన్ ఓపెన్ గానే ఉంచినట్లు స్పష్టం అవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+