రేపటి పెన్షన్ల పంపిణీపై ప్రభుత్వం తాజా ఆదేశాలు, ఇక నుంచి..!!
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కొత్తగా మంజూరైన 10,578 మంది స్పౌజ్ పెన్షన్ల పంపిణీకి ప్రభుత్వం అదనంగా రూ.4.23 కోట్లు విడుదల చేసింది. రేపు (అక్టోబర్ 1) సీఎం చంద్రబాబు విజయనగరం జిల్లాలో పెన్షన్ల పంపిణీలో పాల్గొంటారు. స్పౌజ్ పెన్షన్ల మంజూరు కోసం వచ్చిన దరఖాస్తుల విషయంలో ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. అదే విధంగా వికలాంగుల పెన్షన్లలో అనర్హులను గుర్తించి.. నోటీసులు జారీ చేసినా.. విషయంలో మరో సారి పరిశీలన చేసి నిర్ణయం తీసుకోవాలని డిసైడ్ అయింది.
అక్టోబర్ 1న పంపిణీ చేసే పెన్షన్ల విషయంలో ప్రభుత్వం తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. రేపు (బుధవారం) ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కోసం ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాలకు రూ.2,745.05 కోట్లు విడుదల చేసిందని గ్రామీణ పేదరిక నిర్మూలన (సెర్ప్) శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఈ మొత్తాన్ని అక్టోబరు 1న రాష్ట్రవ్యాప్తంగా 63,50,765 మంది లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు. వీటితోపాటు రాష్ట్రంలో కొత్తగా మంజూరైన 10,578 మంది స్పౌజ్ పెన్షన్ల పంపిణీకి ప్రభుత్వం అదనంగా రూ.4.23 కోట్లు విడుదల చేసిందని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండ లం దత్తి గ్రామంలో నిర్వహించే పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు.

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు తరువాత పింఛన్ల కింద లబ్ధిదారులకు రూ.45 వేల కోట్లు పంపిణీ చేసినట్లు వివరించారు. ఈ ఆర్థిక సంవత్సరానికి పింఛన్ల పంపిణీ కోసం రూ.32,143 కోట్ల బడ్జెట్ కేటాయించగా.. అక్టోబరు వరకు పింఛన్ల పంపిణీకి రూ. 19,111.85 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో పింఛన్ల పంపిణీ ప్రక్రియను మరింత పారదర్శకంగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. కొత్తగా పెన్షన్ల విషయంలో అర్హుల నుంచి ఇప్పటికే దరఖాస్తులు స్వీకరించారు. వెరిఫికేషన్ దాదాపు పూర్తయింది. అనర్హులను తెలిగించి.. అర్హులైన వారికి పంపిణీ ప్రారంభించాలని నిర్ణయించారు. అక్టోబర్ నెల నుంచి కొత్త పింఛన్ల మంజూరు చేసేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొత్తగా వివిధ కేటగిరీల కింద దాదాపు 6 లక్షల వరకు దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పుడు తీసుకున్న తాజా నిర్ణయంతో గతంలో అనేక కారణాలలో పెన్షన్లు నిలిచిపోయిన వారికి ఉపశమనం దక్కనుంది.












Click it and Unblock the Notifications