ఏపీ నూతన సీఎస్ గా, అధికారుల భారీ ప్రక్షాళన - ఎవరెక్కడ..!!

ఏపీలో అధికార యంత్రాంగం భారీ ప్రక్షాళన దిగా కసరత్తు జరుగుతోంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటు తరువాత పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. కీలక శాఖల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు తన లక్ష్యాలను అనుగుణంగా పని చేసే వారికి ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తున్నారు. మంత్రులు - అధికారుల సమన్వయం పైన సమాచారం సేకరిస్తున్నారు. ఈ నెలాఖరున సీఎస్ విజయానంద్ పదవీ విరమణ చేయనున్నారు. కొత్త సీఎస్ పైనా ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలు స్తోంది. కాగా.. పలు స్థానాల్లో పని తీరు ఆధారంగ అధికారుల మార్పులు జరగనున్నాయి.

ఏపీ ప్రభుత్వంలో అధికార వ్యవస్థ లో భారీ మార్పులు ఖాయంగా కనిపిస్తున్నాయి. అధికారుల పని తీరు ఆధారంగా అవసరమైన మార్పుల దిశగా కసరత్తు జరుగుతోంది. ఈ నెలాఖరున ప్రస్తుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ పదవీ విరమణ చేయనున్నారు. సీఎస్ గా కొనసాగుతూనే విజయానంద్ విద్యుత్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బాధ్యతలు సైతం నిర్వహిస్తున్నారు. అదే విధంగా ఏపీ జెన్ కో , ట్రాన్స్ కో చైర్మన్ గా కూడా కొనసాగుతున్నారు.

CM Chandra Babu to finalize the new Chief secretary who will get chance

విజయానంద్ పదవీ విరమణ చేస్తారా.. ప్రభుత్వం ఆయనకు మరో ఆరు నెలల వరకు పొడిగింపు ఇస్తుందా అనేది అధికారిక వర్గాల్లో చర్చగా మారింది. విజయానంద్ కు పొడిగింపు లేకుంటే.. జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న సాయి ప్రసాద్ నూతనంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అయ్యే అవకాశం ఉంది. కాగా, పదవీ విరమణ చేసిన తరువాత విజయానంద్ కు ఆంధ్ర ప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ చైర్మన్ పోస్ట్ విజయానంద్ కు కేటాయించే అవకాశం ఉందని సమాచారం.

ఇక.. సీఎస్ మొదలు పలు శాఖల్లో అధికారుల మార్పు జరగటం ఖాయమని సచివాలయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. ముఖ్య‌మంత్రి కార్యాల‌యంలో కూడా మార్పులు వస్తాయ‌నే ప్ర‌చారం ఉంది. ముఖ్య‌మంత్రి కార్యాల‌యంలో ప‌నిచేసే కీల‌క ఐఏఎస్ కేంద్ర స‌ర్వీసుల‌కు వెళ‌తార‌ని ప్ర‌చారం సాగుతోంది. మ‌రోవైపు ఐఏఎస్ అధికారి కాట‌మ‌నేని భాస్క‌ర్ కేంద్ర స‌ర్వీసుల‌కు వెళ్లటం ఇక లాంఛ‌న‌మే. అయితే..ఆయ‌న కేంద్ర స‌ర్వీసుల‌కు వెళ్లినా..రాష్ట్రంలోనే ప‌నిచేస్తారనే చర్చ ఉంది.

దీంతో, ఆయన్ను విశాఖ‌పోర్టు ఎండిగా నియ‌మిస్తార‌నే ప్ర‌చారం ఉంది. కాటంనేని కేంద్రానికి వెళితే, ప్రస్తుతం ఆయ‌న నిర్వ‌హిస్తోన్న ఐటి, ఆర్‌టిజిఎస్ శాఖ‌ల‌కు మ‌రో అధికారిని నియ‌మిం చాల్సి ఉంటుంది. పెట్టుబడులను ఆహ్వానిస్తూ పరిశ్రమల ఏర్పాటును ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ప్రభుత్వం.. ఈ దిశగా సీనియర్ అధికారులకు ఆ బాధ్యతలను అప్పగించనుంది. సీఎస్ పైన నిర్ణయంతో పాటుగా అధికారుల మార్పు పైన అధికారికంగా నిర్ణయం వెల్లడి కావాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+