TTD: తిరుమలలో సమూల ప్రక్షాళన - దర్శనం, సేవల్లో ఇక..!!
Tirumala: తిరుమలలో పూర్తి స్థాయి ప్రక్షాళన దిశగా కసరత్తు జరుగుతోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత తిరుమల నుంచి ప్రక్షాళన ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. తిరుమలకు కొత్త పాలక మండలి నియమించారు. దర్శనం.. సేవల్లో మార్పుల దిశగా కొత్త ఆలోచన లు చేస్తున్నారు. లడ్డూ వివాదం.. తొక్కిసలాట ఘటనతో ప్రభుత్వం అలర్ట్ అయింది. దీంతో, సీఎం చంద్రబాబు ఈ నెల 14న టీటీడీ పై ఉన్నత స్థాయి సమీక్ష కు నిర్ణయించారు. పలు కీలక నిర్ణయా ల దిశగా కార్యాచరణ సిద్దం అవుతోంది.
సీఎం సమీక్ష
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత టీటీడీ బోర్డుతో పాటుగా అధికారులు కొత్తగా బాధ్యతలు స్వీకరించారు. లడ్డూ అపవిత్రం అయిందనే ఆరోపణలు దేశ వ్యాప్తంగా కలకలం రేపాయి. సుప్రీం ఆదేశాలతో ఈ వివాదం పైన ప్రత్యేకంగా ఏర్పాటైన సిట్ విచారణ చేస్తోంది. వైకుంఠ ఏకాదశి టికెట్ కౌంటర్ల వద్ద తిరుపతిలో జరిగిన తొక్కిసలాట వేళ టీటీడీ నిర్వహణ... సమన్వయం పైన చర్చ జరిగింది. ఈ సమయంలోనే టీటీడీలో అధికారులను మార్పు చేస్తారనే వాదన తెర మీదకు వచ్చింది. తిరుపతి స్థాయిలో అధికారుల పై చర్యలు తీసుకున్న ప్రభుత్వం.. తిరుమలలో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు. దీంతో, ఇప్పుడు ముఖ్యమంత్రి నేరుగా బోర్డు ఛైర్మన్ తో పాటుగా టీడీడీ కీలక అధికారులతో సమీక్ష కు నిర్ణయించారు.

కీలక ప్రతిపాదనలు
ఇప్పటికే తిరుమలలో భక్తులకు దర్శనం.. వసతి తో పాటుగా సౌకర్యాల దిశగా టీటీడీ కొత్త ప్రణాళి కలను సిద్దం చేస్తోంది. దర్శనం విధానంలో ఏఐ సేవలు వినియోగించుకోవాలని ఇప్పటికే టీటీడీ నిర్ణయించింది. ఈ అంశం పైన ముఖ్యమంత్రి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. గత ప్రభుత్వంలో తీసుకున్న వివాదాస్పద నిర్ణయాల పైన సమీక్ష చేయనున్నారు. తిరుమలలో అనధికార దుకాణాలు, రెవిన్యూ విభాగంలో అవినీతి.. అధికారుల తీరు పైన ఇప్పటికే నివేదికలు సిద్దం చేసారు. ఈ అంశాల పైన ముఖ్యమంత్రి స్పష్టమైన మార్గనిర్దేశం చేసే అవకాశం ఉంది. ఇక, టీటీడీలో ఉద్యోగుల నేమ్ బ్యాడ్జీల పైన అధికారికంగా నిర్ణయం తీసుకోనున్నారు. ఇక, తొక్కిసలాట ఘటన తరువాత రద్దీ వేళ చేపడుతున్న చర్యల పైన చంద్రబాబు ఆరా తీయనున్నారు.
కొత్త నిర్ణయాలు
ఇప్పటి వరకు వైకుంఠ ఏకాదశి వంటి ప్రత్యేక సందర్భాల్లో తిరుపతిలో టోకెన్ల జారీకి కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇక నుంచి తిరుపతిలో కౌంటర్ల ఏర్పాటు రద్దు చేయాలనేది తాజా ప్రతిపాద నగా తెలుస్తోంది. తిరుమలతో పాటుగా ఆన్ లైన్ ఈ టోకెన్లు జారీ చేసే అంశం పరిశీలనలో ఉంది. దీంతో, టికెట్ల కోసం రద్దీ తగ్గించటంతో పాటుగా భక్తులకు సౌకర్య వంతంగా ఉంటుందనే అంశం పైన చర్చ జరుగుతోంది. ఇక, భక్తుల వసతి సౌకర్యాల విషయంలో ఈ సమీక్ష లో కీలక నిర్ణయాలు తీసుకునే విధంగా ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. దీంతో, తిరుమలలో ఈ సమీక్ష తరువాత కొత్త నిర్ణయాలు అమలు అయ్యే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications