BREAKING: ఏపీలో సోషల్ మీడియా బ్యాన్- నిండు అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంచలన ప్రకటన చేశారు. 13 ఏళ్లలోపు పిల్లలకు సామాజిక మాధ్యమాల వినియోగాన్ని నిషేధిస్తున్నట్లు ప్రకటించారు. ఈ విధానం 90 రోజుల్లో దశలవారీగా అమలు వచ్చేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. వయస్సు పరిమితి 13 వరకే పరిమితం చేయాలా లేక 16 సంవత్సరాల వరకు పెంచాలా అనేది త్వరలో నిర్ణయిస్తామని తెలిపారు. పిల్లలకు సోషల్ మీడియాను దూరంగా ఉంచాలనే డిమాండ్ చాలాకాలంగా వినిపిస్తోందని, దీనికి అనుగుణంగా చర్యలు తీసుకున్నామని తెలిపారు.
రాష్ట్రంలో యువతపై డిజిటల్ వినియోగం చూపే ప్రభావాలను అరికట్టడానికి ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు చంద్రబాబు. 13 నుంచి 16 ఏళ్ల వయస్సు గల కౌమారదశ పిల్లలకు కూడా ఈ నిషేధాన్ని విస్తరించాలా వద్దా అని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. విస్తృత సంప్రదింపులు, విధాన సమీక్షల తర్వాత మరింత కఠినమైన చర్యలు ప్రవేశపెట్టడానికి గల అన్ని అవకాశాలను పరిశీలిస్తామని స్పష్టం చేశారు.

ఈ విషయాన్ని ఐటీ మంత్రి నారా లోకేష్ గతంలోనే వెల్లడించిన విషయం తెలిసిందే. 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియాను ఉపయోగించకుండా చర్యలు తీసుకోవాలని భావిస్తోన్నట్లు దావస్ పర్యటన సందర్భంగా ఆయన తెలిపారు అప్పట్లో. ఈ విషయంలో ఆస్ట్రేలియా ప్రవేశపెట్టిన చట్టం అమలు తీరుపై లోతుగా అధ్యయనం చేయనున్నట్లు చెప్పారు. ఈ విధానం ఏ విధంగా పనిచేస్తుందో, తమ రాష్ట్రంలో అమలు చేయడానికి ఉన్న సాధ్యసాధ్యాలను విశ్లేషిస్తోన్నామని నారా లోకేష్ వివరించారు.
దీనికోసం బలమైన చట్టపరమైన నిబంధనను రూపొందించాల్సిన అవసరం ఉందని నారా లోకేష్ చెప్పారు. ఓ నిర్దుష్ట వయస్సు లోపు యువకులు సోషల్ మీడియాను ఉపయోగించకూడదని తాను గట్టిగా అభిప్రాయపడుతున్నానని అన్నారు. సోషల్ మీడియాలో తాము చూస్తోన్న కంటెంట్ ను ఈ కౌమార దశ పిల్లలు అర్థం చేసుకోలేరని నారా లోకేష్ పేర్కొన్నారు. ఈ విషయంలో పిల్లల రక్షణ అత్యవసరమని అభిప్రాయపడ్డారు.
పిల్లలు సోషల్ మీడియా వాడకంపై నిషేధం విధిస్తున్నట్లు తొలుత కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. 16 సంవత్సరాలు, అంతకంటే తక్కువ వయస్సు ఉన్న వారందరికీ సామాజిక మాధ్యమాల వినియోగానికి చెక్ పెట్టబోతోన్నామని వెల్లడించింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను సిద్ధం చేసింది కూడా. స్మార్ట్‌ఫోన్ వ్యసనం, ఆన్‌లైన్ భద్రత ప్రమాదాలు, యువ వినియోగదారులలో అధిక స్క్రీన్ సమయం వంటి పెరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.
ఈ విషయాన్ని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్వయంగా ప్రకటించారు. 2026-27 బడ్జెట్‌ను ఆయన ఈ ఉదయం సభల ప్రవేశపెట్టారు. ఆ సందర్భంగా ఈ ప్రకటన చేశారు. మొబైల్ ఫోన్ల వినియోగం వల్ల పిల్లలపై కలిగే ప్రతికూల ప్రభావాలను నివారించడమే దీని ప్రధాన ఉద్దేశమని తెలిపారు. సామాజిక మాధ్యమాల వినియోగాన్ని నిషేధించాలని స్పష్టమైన ప్రకటన చేసిన మొదటి రాష్ట్రంగా నిలిచింది కర్ణాటక.
-
త్వరలోనే జగన్ పాదయాత్ర.. చంద్రబాబుకు రోజుకో సినిమా చూపిస్తారట! -
ఈ చేపల్లో తేడాగా ఉన్నది ఏదో కనిపెట్టగలరా..? -
ఈ బొమ్మల్లో నిజమైన "గుడ్లగూబ" ఎక్కడుందో కనిపెట్టగలరా..? -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !!












Click it and Unblock the Notifications