పరకామణి చోరీ చిన్నదా: జగన్ కామెంట్స్‌పై సీఎం చంద్రబాబు అటాక్..!!

అమరావతి:ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శనివారం అమరావతిలోని ఎన్టీఆర్ భవన్‌లో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) పాలనపై, ముఖ్యంగా టీటీడీలో జరిగిన పరకామణి చోరీ ఉదంతం, శాంతిభద్రతల క్షీణతపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

పరకామణి చోరీ చిన్నదా..
టీటీడీ పరకామణి చోరీ ఉదంతంపై జగన్ చేసిన వ్యాఖ్యలను సీఎం చంద్రబాబు తీవ్రంగా ఖండించారు."బాబాయ్ హత్యే వాళ్లకి చిన్న విషయం అయినప్పుడు, పరకామణి దొంగతనం పెద్ద విషయం ఎలా అవుతుంది? ఏ మాత్రం నైతికత లేని వాళ్లే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారు," అంటూ జగన్‌ను ఉద్దేశించి చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.జగన్ వ్యాఖ్యలు శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని వ్యాఖ్యానించిన సీఎం... జగన్‌కు దేవుడన్నా భక్తులన్నా ఏమాత్రం లెక్కలేదని చెప్పారు. దొంగతనం చేసిన వాడు తిరిగి డబ్బులు చెల్లించాడు కదా అని జగన్ చెప్పడం, అతన్ని వెనుకేసుకురావడంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

cm-chandrababu-attacks-jagan-questions-how-parakamani-theft-is-small-one

దొంగతనానికి బదులుగా రూ.14 కోట్లు
దొంగలించింది రూ.70వేలు అనేది చిన్న మొత్తమే కావొచ్చు కానీ... భక్తులు సమర్పించిన కానుకల నుంచి దోపిడీ చేయడం దారుణమన్నారు. పైగా చోరీ చేసినందుకుగాను రూ.14 కోట్లు చెల్లించేందుకు ఆ వ్యక్తి సిద్ధమయ్యాడని గుర్తుచేశారు.గతంలో పరకామణి చోరీ జరిగినప్పుడు, నిందితులకు క్షమాభిక్ష పెట్టి, దొంగిలించబడిన రూ.70 వేలకు బదులుగా, టీటీడీకి రూ.14 కోట్లు ఇస్తానని నిందితుల్లో ఒకరు కోర్టులో చెప్పినట్లు వార్తలు వచ్చాయి. దీనిపై జగన్మోహన్ రెడ్డి అనుకూల వ్యాఖ్యలు చేశారని సీఎం చంద్రబాబు పరోక్షంగా ఈ సందర్భంగా ప్రస్తావించారు.టీటీడీలో దోపిడీ ఏ స్థాయిలో జరిగిందో దీనిబట్టే అర్థమవుతోందని అన్నారు.

సమాజానికి ఏం చెప్తున్నారు..?
"దొంగతనాన్ని కూడా తప్పు కాదు అని చెప్పే వాళ్లను ఏమనాలి? బాబాయ్ హత్యనే సెటిల్ చేసుకుందాం అని చూసిన వ్యక్తి జగన్. ఇప్పుడు తిరుమల పరకామణి చోరీని కూడా సెటిల్ చేయాలని చూడటం ఘోరం. సెంటిమెంట్ విషయాల్లో కూడా సెటిల్‌మెంట్ అంటూ వ్యాఖ్యాలా? నేరస్థులను వెనకేసుకొస్తాను అంటూ సమాజానికి ఏం చెప్తున్నారు," అంటూ సీఎం చంద్రబాబు ప్రశ్నల వర్షం కురిపించారు.

వైసీపీ హయాంలో లేడీ డాన్‌లు
రాష్ట్రంలో శాంతిభద్రతలు, అభివృద్ధి విషయంలో గత వైఎస్సార్సీపీ పాలన ఎంతగా క్షీణించిందో చంద్రబాబు వివరించారు. "గతంలో నెల్లూరు, విజయనగరం జిల్లాలు ఎంతో ప్రశాంతంగా ఉండేవి. కానీ వైసీపీ హయాంలో నెల్లూరు జిల్లాలో 'లేడీ డాన్స్' తయారవటం ఆశ్చర్యం కలిగించింది. శాంతిభద్రతల విషయంలో రాజీ ప్రసక్తే లేదు. ప్రస్తుతం వాటిని అదుపులో పెడుతున్నాం," అని స్పష్టం చేశారు.

హైదరాబాద్‌ అభివృద్ధి పై...
రాజధానిలో అభివృద్ధి జరుగుతుంటే రైతులు, ప్రజలు ఆనందంగా ఉన్నారని, అయితే ఈ అభివృద్ధిని చూసి రాజకీయంగా కొందరు తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు. హైదరాబాద్‌లో టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధిని నేటి పాలకులూ గుర్తిస్తున్నారని, ఇప్పుడు కోకాపేటలో ఎకరం భూమి రికార్డు స్థాయిలో ధర పలుకుతోందని ఆనందం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా తనయుడు మంత్రి నారా లోకేష్ చిన్ననాటి సంఘటనను చంద్రబాబు గుర్తు చేసుకున్నారు.లోకేష్ చిన్నతనంలో పేరెంట్ టీచర్ మీటింగ్‍కు బిజీగా ఉండడం వల్ల వెళ్లలేకపోయినట్లు చెప్పిన సీఎం... నిన్నటి కార్యక్రమం ఘనంగా జరగటం చూసి లోకేష్ విద్యార్థి దశను గుర్తుచేసుకున్నట్లు తెలిపారు.కూటమి భాగస్వాములైన పవన్ కళ్యాణ్, మంత్రులు, ఇతర కూటమి నేతలు కార్యక్రమంలో పాల్గొని దాన్ని విజయవంతం చేశారని చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+