50ఏళ్లు నిండిన గిరిజనులకు పింఛను: చంద్రబాబు
విశాఖపట్నం: 50 ఏళ్లు నిండిన గిరిజనులకు పింఛను ఇస్తామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గురువారం ప్రకటించారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా విశాఖ మన్యం కేంద్రం పాడేరులోచంద్రబాబు నాయుడు గురువారం పర్యటించారు. ఆడారిమెట్టలో ఏర్పాటు చేసిన గ్రామదర్శిని కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. 32 ఏళ్ల కిందట ఎన్టీఆర్ దర్శించిన గ్రామంలో తాను పర్యటించడం తన అదృష్టంగా భావిస్తున్నానని ఈ సందర్భంగా చంద్రబాబు అన్నారు. గ్రామదర్శిని కార్యక్రమంలో మహిళల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో మరుగుదొడ్లు, పింఛను, చంద్రన్న బీమా అందుతున్న తీరుతెన్నులు అడిగి తెలుసుకున్నారు. ప్రాథమిక పాఠశాలలో డిజిటల్ తరగతులను ప్రారంభించారు.

50 ఏళ్లు నిండిన గిరిజనులకు పింఛను ఇస్తామని ఈ సందర్భంగా చంద్రబాబు ప్రకటించారు. గిరిజనులపై ఉన్న ప్రేమతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చంద్రబాబు చెప్పారు. గిరిజనుల కోసం తాము చేస్తున్న కృషి చూసి అరకు, పాడేరు ఎమ్మెల్యేలు టీడీపీతో కలిశారని సీఎం వివరించారు.
బాక్సైట్‌పై అప్పుడు రాజశేఖర్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారు... గిరిజనులకు నష్టం జరుగుతుందనే తాను సీఎం అయ్యాక బాక్సైట్‌ను రద్దు చేశానని తెలిపారు. అనుమతులు పొందినవారు న్యాయస్థానినికి వెళ్లారు, కేంద్ర ప్రభుత్వం నాపై ఒత్తిడి చేసినా ఒప్పుకోలేదని వివరించారు. గిరిజనులకు హాని కలిగించే బాక్సైట్ జోలికి వెళ్లనని చంద్రబాబు స్పష్టం చేశారు.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్!












Click it and Unblock the Notifications