ఏపీ మంత్రులకు ర్యాంకులు.. ఫస్ట్ ఎవరు ? లాస్ట్ ఎవరంటే ??
ఏపీ మంత్రులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ర్యాంకులు ప్రకటించారు. మంత్రుల పనితీరు, ఫైల్ క్లియరెన్స్, పర్యటన, పార్టీ కార్యకర్తలతో, ప్రజలతో సంబంధం, ప్రభుత్వ పథకాల అమలు వంటి అంశాల ఆధారంగా ఈ ర్యాంక్ లను ఇచ్చినట్టు తెలుస్తోంది.
ఈ ర్యాంకింగ్ లో మొదటి స్థానంలో మంత్రి రామానాయుడు ఉండగా.. రెండో స్థానంలో నారా లోకేష్.. మూడవ స్థానంలో సత్య కుమార్ ఉన్నారు. ఇక చివరి స్థానంలో కొల్లు రవీంద్ర.. అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్ ఉన్నారని సమాచారం.

ప్రస్తుత ర్యాంకింగ్స్‌లో:
1వ స్థానం: మంత్రి రామానాయుడు
2వ స్థానం: నారా లోకేష్
3వ స్థానం: సత్య కుమార్
4వ స్థానం: అనిత
5వ స్థానం: నాదెండ్ల మనోహర్
చివరి స్థానం: కొల్లు రవీంద్ర
అంతే కాకుండా నియోజకవర్గంలో మంత్రులు ఎంత ప్రభావం చూపిస్తున్నారు. ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా తీసుకెళ్తున్నారా ? ప్రతికూల పార్టీ వ్యూహాలకు కౌంటర్ ఇచ్చే సామర్థ్యం వంటి అంశాలను కూడా పరిగణలోకి తీసుకున్నట్టు తెలుస్తోంది.
సీఎం చంద్రబాబు అభిప్రాయం ప్రకారం, ర్యాంకింగ్ ద్వారా మంత్రులు మరింత ఫోకస్, జవాబుదారీదనంతో పని చేస్తారని భావిస్తున్నారు. టాప్ ర్యాంక్ మంత్రులకు ప్రోత్సాహం, తక్కువ ర్యాంక్‌లో ఉన్నవారికి మరింత కృషి చేయడానికి ప్రేరణ అవుతుందని అనుకుంటున్నారు.












Click it and Unblock the Notifications