ఆర్ధిక ఇబ్బందుల్లో ఏపీ: బాబు దుబారా ఖర్చు మాత్రం 133 కోట్లు
అమరావతి: 2015-16 సంవత్సరానికి గాను అదనపు నిధుల కోసం అనుబంధ పద్దును ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు సోమవారం అసెంబ్లీకి సమర్పించారు. ఈ పద్దులో ముఖ్యమంత్రి చంద్రబాబు దుబారా, ప్రచార ఆర్భాటాలకు, స్వదేశీ, విదేశీ పర్యటనలకు అయిన అదనపు వ్యయం ఏకంగా రూ. 133.05 కోట్లుగా ఆర్థికశాఖ లెక్కలు తేల్చింది.
'విభజన తర్వాత ఏపీ ఆర్ధిక ఇబ్బందుల్లో ఉంది' ప్రతి బహిరంగ సభలోనూ చంద్రబాబు చెప్పే మాట ఇది. ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నాం గనుక దుబారా వ్యయం చేయరాదు. ప్రజా ధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేయకూడదు, పొదుపు చేయాలంటూ చంద్రబాబు పలు సందర్భాల్లో చెప్పారు.
అయితే ఇతరులకే ఈ మాటలు వర్తిస్తాయి తప్ప ముఖ్యమంత్రికి కాదని స్వయానా ఆర్థికశాఖ వెలువరించిన లెక్కలే సూచిస్తున్నాయి. 2015-16 సంవత్సరానికి గాను ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన దుబారా ఖర్చు అక్షరాలా రూ. 133.05 కోట్లు. ఈ మొత్తం కేవలం సీఎం జిల్లాల పర్యటనకు, పుష్కరాల్లో ప్రచారానికి, రాష్ట్ర ఉత్సవాల కోసం ప్రభుత్వం ఖర్చు చేసింది.

దీనికి తోడు సీఎం ప్రయాణించేందుకు ప్రత్యేక విమానాలు, హైదరాబాద్‌తో పాటు అమరావతిలోని కార్యాలయాలకు నిధులు అదనం. ఈ వ్యయానికి ఆమోదం తెలపాలంటూ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు సోమవారం అసెంబ్లీలో అనుబంధ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.
మరోవైపు స్వాతంత్య్ర దినోత్సవం, రిపబ్లిక్‌డే, రాష్ట్ర అవతరణ దినోత్సవాల నిర్వహణకు ఏకంగా రూ.19.33 కోట్లను అదనంగా వ్యయం చేసినట్లు సప్లిమెంటరీ బడ్జెట్‌లో పేర్కొన్నారు. అయితే రాష్ట్ర అవతరణ ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం అసలు నిర్వహించనే లేదు.












Click it and Unblock the Notifications