అదిరిపోయే శుభవార్త చెప్పిన చంద్రబాబు.. మగాళ్ళకు డ్వాక్రా సంఘాలు

టిడిపి హయాంలో మహిళలను గ్రూపులుగా చేసి డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసి వారిలో పొదుపు నేర్పించి మహిళా సాధికారత కోసం చంద్రబాబు సర్కార్ కృషి చేసిన విషయం తెలిసిందే. ఇక తాజాగా మరోమారు పురుషుల పైన కూడా ఈ ఫార్ములాను వర్తింపజేయాలని కూటమి ప్రభుత్వం వినూత్నంగా ఆలోచించింది. దాదాపు 30 సంవత్సరాలుగా విజయవంతమైన డ్వాక్రా సంఘాలను పురుషుల విషయంలో కూడా ఏర్పాటు చేసే ప్లాన్ లో ఉంది.

పురుషులతోనూ డ్వాక్రా తరహా గ్రూపులు
పురుషులతో గ్రూపులు ఏర్పాటు చేసి, వారికి లోన్లు ఇవ్వటం ప్రారంభిస్తే వారికి సైతం స్వయం ఉపాధిని కల్పించినట్టు అవుతుందని భావిస్తోంది. ఈ క్రమంలోనే అనకాపల్లి జిల్లాలో 28 గ్రూపులను ఏర్పాటు చేయాలనేది లక్ష్యంగా పెట్టుకున్న కూటమి సర్కార్ ఇప్పటికీ 20 గ్రూపులను ఏర్పాటు చేసింది. గ్రూపులను కామన్ ఇంట్రెస్ట్ గ్రూప్ గా పిలుస్తున్నారు. ఇక డ్వాక్రా సంఘాలు అంటే మహిళలు మాత్రమే కాదు ఇకపై పురుషులు కూడా..

CM Chandrababu Naidu gave amazing good news Dwakra groups for men

తక్కువ వడ్డీకి పురుషులకు లోన్లు
పురుషులు ఆర్థిక స్వావలంబన సాధించడానికి పనికి వస్తాయని కామన్ ఇంట్రెస్ట్ గ్రూపులుగా వీటిని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది. అనకాపల్లిలో ప్రయోగాత్మకంగా 20 కామన్ ఇంట్రెస్ట్ గ్రూపులను ఏర్పాటు చేసి వారికి తక్కువ వడ్డీకి బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది.

ఐదుగురు సభ్యులతో కామన్ ఇంట్రెస్ట్ గ్రూప్
ఇక రుణాలు సక్రమంగా చెల్లిస్తే డ్వాక్రా సంఘాల మాదిరిగానే వీరికి రుణ పరిమితిని కూడా బ్యాంకులు పెంచే అవకాశం ఉంది. ఐదుగురు సభ్యులు వస్తే చాలు, ఎన్ని గ్రూపులు అయినా ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఈ గ్రూపులను ఏర్పాటు చేస్తున్న యుసిడి పీడీ వెల్లడించారు.

ఈ గ్రూప్స్ లో వీరు చేరొచ్చు.. ఇలా చెయ్యాలి
భవన నిర్మాణ కార్మికులు ,వాచ్ మెన్లు, రిక్షా కార్మికులు, ఫుడ్ డెలివరీ బాయ్స్, ప్రైవేట్ గా పని చేసే వారు ఎవరైనా సరే 18 ఏళ్ల నుండి 60 ఏళ్లలో ఉన్న పురుషులు కామన్ ఇంట్రెస్ట్ గ్రూప్లో చేరవచ్చు. తెల్ల రేషన్ కార్డు, ఆధార్ కార్డును వారి దరఖాస్తు తో పాటు అందిస్తే గ్రూప్ ను ఏర్పాటు చేస్తారు. ఐదుగురు సభ్యులతో ఒక గ్రూపును సిద్ధం చేస్తారు. ఇక అనకాపల్లిలో ఈ విధానం సక్సెస్ అయితే రాష్ట్రవ్యాప్తంగా ఈ విధానాన్ని అమలు చేసే అవకాశం ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+