గడువులోగా పోలవం పనులు పూర్తి కావాల్సిందే, అధికారులు సీఎం ఆర్డర్స్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీవనాడి పోలవరం ప్రాజెక్టును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సందర్శించారు. ప్రాజెక్టు నిర్మాణం పనుల పురోగతిని సీఎం స్వయంగా పరిశీలించారు. బుధవారం ఉదయం 10 గంటలకు ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి బయలుదేరిన సీఎం చంద్రబాబు నేరుగా పోలవరం వెళ్లారు. ఎరియల్ వ్యూ ద్వారా ప్రాజెక్టును పరిశీలించారు. ప్రాజెక్టు వ్యూ పాయింట్‌తో పాటు... కాఫర్ డ్యామ్, బట్రస్ డ్యామ్, ఈసీఆర్ఎఫ్ గ్యాప్ 1, గ్యాప్ 2 పనులను పర్యవేక్షించారు. నిర్మాణం చివరి దశకు చేరుకున్న డయాఫ్రమ్ వాల్‌ను కూడా సీఎం తనిఖీ చేశారు. అనంతరం ప్రాజెక్ట్ సైట్ వద్దనే అధికారులతో సమీక్ష నిర్వహించారు.
పోలవరం ప్రాజెక్టు సైట్ వద్ద అధికారులతో సమీక్షలో భాగంగా సీఎం చంద్రబాబు పలు సూచనలు చేశారు. మంత్రులు నిమ్మల రామానాయుడు, కొలుసు పార్ధసారధి, నాదెండ్ల మనోహర్, జలవనరుల శాఖ ఉన్నతాధికారులు, ఇంజనీర్లుకు దిశానిర్దేశం చేశారు. ప్రాజెక్టులో 87 శాతం మేర సివిల్ పనులు పూర్తి అయ్యాయని... గడువులోగా మిగతా పనులు పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. ప్రాజెక్టు నిర్వాసితుల పునరావాసం, ఆర్ అండ్ ఆర్ పనులపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టాలన్నారు. పునరావాసం, ఆర్ అండ్ ఆర్ పనులపై యాక్షన్ ప్లాన్ రూపొందించుకుని పని చేయాలని సూచించారు
పోలవరం ఎడమ కాలువ పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్న సీఎం.. కుడికాలువ ద్వారా కొల్లేరు ప్రాంతాలకు కూడా నీరు వెళ్లేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. మే మొదటి వారంలో మళ్లీ పోలవరం ప్రాజెక్టు పనుల్ని తనిఖీ చేస్తానని సీఎం వెల్లడించారు.

88 శాతం పూర్తయిన ప్రాజెక్టు నిర్మాణం
గత ప్రభుత్వ పాలనలో నిర్లక్ష్యం కారణంగా నిలిచిపోయిన ప్రాజెక్టు పనులు.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరుగులు పెడుతున్నాయి. ఈ 18 నెలల కాలంలో 13 శాతం మేర ప్రాజెక్టు పనులు పూర్తయ్యాయి. మొత్తంగా ఇప్పటివరకు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం 87.8 శాతం మేర జరిగింది. 2014-19 మధ్య కాలంలోనే ప్రాజెక్టులో సివిల్ పనులు 72 శాతం జరిగాయి. అయితే గత ప్రభుత్వ హయాంలో 2019 నుంచి 2025 వరకు 5 ఏళ్లలో కనీసం 2 శాతం పనులు కూడా చేపట్టలేదు. ఐదేళ్ల కాలంలో జరిగిన నష్టాన్ని పూరించేలా సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారు.
పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నేడు ఏరియల్ విజిట్ ద్వారా పరిశీలించారు. వ్యూ పాయింట్ నుంచి స్పిల్ వే సహా మొత్తం ప్రాజెక్టును, డయాఫ్రమ్ వాల్ సహా ఇతర నిర్మాణాలను వీక్షించారు.#PolavaramProject#AndhraPradesh pic.twitter.com/14zEt8bq5A
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) January 7, 2026












Click it and Unblock the Notifications