వినాయక చవితి పండుగకు వైసీపీకి బంఫర్ ఆఫర్ ఇచ్చిన చంద్రబాబు, సీన్ !
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వినాయక చవితి సందర్భంగా వైసీపీకి చెందిన కొందరు నాయకులకు బంపర్ ఆఫర్ ఇవ్వడానికి సిద్ధమయ్యారని సమాచారం. గత వైసీపీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేసి జైలుకు పంపించిన విషయం తెలిసిందే. 52 రోజులపాటు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 2023 అక్టోబర్ 31వ తేదీన బెయిల్ మీద బయటకు వచ్చారు.
చంద్రబాబు రాజకీయ జీవితంలో జగన్ ప్రభుత్వంలోనే మొదటిసారి ఆయన జైలుకు వెళ్లారు. తనను జైలుకు పంపించిన వైసీపీ నాయకుల భరతం పట్టాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇంతకాలం వేచి చూశారు. .అనుకున్నట్లే ఆంధ్రప్రదేశ్ వైసీపీ ప్రభుత్వం కుప్పకూలిపోయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పుడు వైసీపీ నాయకులపై ఫోకస్ పెట్టారు.

ఇదే కేసులో ఆంధ్రప్రదేశ్ మాజీమంత్రి, వైసీపీ నాయకుడు జోగి రమేష్, వైసీపీ నాయకుడు దేవినేని అవినాష్ తదితరుల కోసం 12 ప్రత్యేక బృందాల పోలీసులు గాలిస్తున్నారు. బాపట్ల మాజీఎంపీ నందిగం సురేష్ ను హైదరాబాదులో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. మొత్తం మీద వినాయక చవితి పండుగ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు వైసీపీకి చెందిన కొందరు నాయకులకు బంపర్ ఆఫర్ ఇస్తున్నారని తెలిసింది. శనివారం వినాయక చవితి సందర్బంగా కోర్టుకు సెలవు, మరసటి రోజు ఆదివారం కూడా సెలవు కావడంతో ఇప్పుడు వైసీపీ నాయకులు పోలీసుకు చిక్కకుండా తప్పించుని తిరుగుతున్నారని తెలిసింది.












Click it and Unblock the Notifications