విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బోటు ప్రమాదంపై నివేదిక, షాకింగ్: ఆ కంపెనీక అనుమతి లేదు, ఉదయమే అధికారులు దింపేశారు

బోటు ప్రమాదంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ప్రాథమిక నివేదిక అందింది. ఈ నివేదికలోను ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ప్రమాదం నేపథ్యంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు.

|
Google Oneindia TeluguNews

విజయవాడ: బోటు ప్రమాదంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ప్రాథమిక నివేదిక అందింది. ఈ నివేదికలోను ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ప్రమాదం నేపథ్యంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు.

Recommended Video

Krishna River Boat Incident : Ex-Gratia Announced Video | Oneindia Telugu

చదవండి: ఇసుకదిబ్బని ఢీకొట్టి, లైఫ్ జాకెట్లు అడిగినా ఇవ్వక: బోటు ప్రమాదానికి కారణాలివీ!

సబ్ కలెక్టర్ కార్యాలయంలో దీనిని ఏర్పాటు చేశారు. మృతులంతా ఒంగోలు వాసులు కావడంతో ప్రకాశం జిల్లాలో టోల్‌ఫ్రీ నంబర్‌ 08592 281400 ఏర్పాటు చేశారు.

చదవండి: ప్రమాదంపై జగన్, మీకు చేతకాకుంటే మేమొచ్చాం: ఊగిపోయిన వైసిపి నేత, తొలుత స్పందించింది వారే

అనుమతి లేకుండా బోటు నడిపిన ప్రయివేటు సంస్థ

అనుమతి లేకుండా బోటు నడిపిన ప్రయివేటు సంస్థ

ఈ బోటును నడిపింది రివర్ బే సంస్థ అని తెలుస్తోంది. దీనికి బోటు నడిపేందుకు అనుమతి లేదు. అయినప్పటికీ ప్రయాణీకులను తీసుకొని వెళ్లిందని తెలుస్తోంది. ఈ మేరకు ఆ సంస్థకు అనుమతి లేదని ప్రాథమిక నివేదికలోను అధికారులు తెలిపారు.

బోటును నియంత్రించలేకే ప్రమాదం జరిగింది

బోటును నియంత్రించలేకే ప్రమాదం జరిగింది

బోటును నియంత్రించలేకే ప్రమాదం జరిగినట్లు నివేదికలో పేర్కొన్నారు. సుడిగుండం వంటివి వచ్చినప్పుడు బోటును నియంత్రించేలా లేదన్నారు. రాయపూడి నుంచి ఫెర్రీ వరకు బోటును నడుపుతున్నట్లు నివేదికలే పేర్కొన్నారు.

ఉదయం ప్రయాణీకులను అడ్డుకున్నాం

ఉదయం ప్రయాణీకులను అడ్డుకున్నాం

బోటు ప్రమాదంపై పర్యాటక శాఖ సెక్రటరీ మీనా మాట్లాడారు. బోటు నడుపుతున్న కంపెనీకి అనుమతులు లేవని చెప్పారు. చట్టవిరుద్ధంగా దానిని తిప్పారన్నారు. యాజమాన్యంపై కేసు నమోదు చేస్తామన్నారు. ఉదయమే ఆ కంపెనీ బోటు ప్రయాణీకులను ఎక్కించుకుంటే కిందకు దింపామని, ఉదయం అడ్డుకున్నా సాయంత్రం మళ్లీ ఎక్కించుకున్నారన్నారు.

వెంటనే రంగంలోకి దిగారు

వెంటనే రంగంలోకి దిగారు

కాగా, ప్రమాదం విషయం తెలియగానే 30 మందితో కూడిన రెండు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, 45 మందితో కూడిన ఎస్డీఆర్ఎఫ్ బృందం, అరవై మంది డిసాస్టర్ మెంబర్స్ టీం, ఫైర్ సిబ్బంది, ఇతర సిబ్బంది రంగంలోకి దిగింది.

English summary
2 teams each comprising 30 NDRF personnel, a 45 member team of the SDRF and 60 members of the Disaster Response and fire services department have been roped into the rescue operation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X