బాలయ్యకు గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు .. ఏంటో తెలుసా?
హిందూపురం నియోజకవర్గం 1983 నుంచి టీడీపీకి కంచుకోటగా మారింది. నందమూరి బాలకృష్ణ ఈ నియోజకవర్గంలో 2014 నుంచి వరుసగా మూడోసారి ఘన విజయం సాధించారు. అయితే తాజాగా బాలయ్య చొరవతో హిందూపురంకు మహార్దశ పట్టబోతోంది. నియోజకవర్గం అభివృద్ధికి అవసరమైన నిధులను విడుదల చేయాలని సీఎం చంద్రబాబు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయాలన్న బాలయ్య కృషి ఫలించినట్లు అయింది.
హిందూపురంలో రోడ్ల విస్తరణ, తాగునీటి వ్యవస్థ ఏర్పాటు.. ఇతర అభివృద్ధి పనుల కోసం రూ.92.50 కోట్లు విడుదల చేయనున్నారు అధికారులు. అంతేకాక పట్టణంలో ఇంటింటికీ తాగునీటి సరఫరాకు అవసరమైన ఇంటర్నల్ తాగునీటి వ్యవస్థ ఏర్పాటుకు రూ.136 కోట్ల ప్రతిపాదనలను ఆమోదం తెలిపారు. ఈ నిధులు మరి కొద్ది నెలల్లో విడుదల కానున్నాయి. అలాగే పట్టణంలోని గుడ్డం కోనేరు అభివృద్ధికి అహుడా నిధుల నుంచి రూ.1.50 కోట్లు మంజూరు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు సీఎం చంద్రబాబు.

ఇక నటసింహం నందమూరి బాలకృష్ణ ఓ వైపు నియోజకవర్గ పనులు చూసుకుంటూనే మరోవైపు సినిమాలతో దూసుకెళ్తున్నారు. ఒకవేళ ఆయన అందుబాటులో లేకపోయినా ప్రజల సమస్యల్ని తెలుసుకుని పరిష్కరించే బాధ్యతను టీడీపీ సమన్వయకర్త శ్రీనివాసరావు, పీఏ వీరయ్యలకు అప్పగించారు. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం బాలయ్య అఖండ 2 చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం ఈ ఏడాది దసరా కానుకగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications