• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఈ నెల 23న సిఎం చంద్రబాబు పోలవరం పర్యటన

By Suvarnaraju
|

అమరావతి: పోలవరం ప్రాజెక్ట్ పనుల పర్యవేక్షణ నిమిత్తం సీఎం చంద్రబాబు ఈనెల 23న పోలవరంలో పర్యటించనున్నారు. ప్రతి నెలా మూడోవారంలో పోలవరం ప్రాజెక్ట్ పనులను స్వయంగా పరిశీలించేందుకు పోలవరం ప్రాజెక్టును సందర్శిస్తానని సిఎం చంద్రబాబు గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఇటీవల రాజకీయ పరిణామాల కారణంగా ప్రాజెక్ట్ పనులను స్వయంగా పర్యవేక్షించడానికి వీలు కాకపోవడంతో వర్చువల్ రివ్యూకే చంద్రబాబు పరిమితం కావాల్సివచ్చింది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 23 న తప్పనిసరిగా పోలవరం పర్యటనకు వెళ్లితీరాలని సిఎం చంద్రబాబు భావిస్తున్నట్లు తెలిసింది. సోమవారం వెలగపూడి సచివాలయంలోని తన కార్యాలయంలో పోలవరం సహా రాష్ట్ర ప్రాధాన్య ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.

  ఏప్రిల్‌ 20న నిరాహార దీక్ష : చంద్రబాబు

  CM Chandrababu Naidu to visit Polavaram Works on April 23

  ఇక మే నెలలో పోలవరం ప్రాజెక్ట్ పరిధిలో 960 మెగావాట్ల జల విద్యుత్ కేంద్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు భూమిపూజ చేయనున్నట్లు తెలిసింది. తొలుత ఈ నెల 23న ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనలోనే విద్యుత్ కేంద్రానికి భూమి పూజ చేయాలని జెన్కో అధికారులు భావించినట్లు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన తవ్వకం పనులు సకాలంలో పూర్తి కాకపోవడంతో వచ్చే నెలలో ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని ఇంధనవనరుల శాఖ అధికారులు నిర్ణయించారు.

  పోలవరం ప్రాజెక్టు కోసం ఇప్పటివరకు పెట్టిన ఖర్చులో కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు త్వరగా తిరిగిచ్చేలా కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, అరుణ్ జైట్లీకి లేఖలు రాయాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. సోమవారం సెక్రేటరియట్ లో ఎపి ప్రాజెక్ట్ ల రివ్యూ మీటింగ్ లో ఆయన ఈ మేరకు అధికారులకు దిశానిర్ధేశం చేశారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఎప్పటికప్పుడు బకాయిలు చెల్లించేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని సిఎం సూచించారు.

  పోలవరం ప్రాజెక్ట్ పురోగతి గురించి సమీక్ష సందర్భంగా ఇప్పటివరకుపోలవరం ప్రాజెక్టు 52.20 శాతం పూర్తికాగా, ప్రధాన కుడి కాలువ 89.10 శాతం, ప్రధాన ఎడమ కాలువ 58.30 శాతం పనులు పూర్తయినట్టు అధికారులు తెలిపారు. అలాగే 53 ప్రాధాన్య ప్రాజెక్టుల్లో పులకుర్తి ఎత్తిపోతల పథకం, హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ రెండో దశలో భాగమైన అడవిపల్లి రిజర్వాయర్ ఈ నెలాఖరు నాటికి పూర్తవుతాయని చెప్పారు. అడవిపల్లి ఎత్తిపోతల పథకం వచ్చే నెల 15 నాటికి సిద్ధం కానుందని అధికారులు ముఖ్యమంత్రి కి వివరించారు. అలాగే నెల్లూరు బ్యారేజ్, సంగం బ్యారేజ్‌కు సంబంధించి ముఖ్యమైన నిర్మాణాల పనులు వచ్చే నెలాఖరుకు పూర్తవుతాయని అధికారులు వెల్లడించారు.

  అలాగే పోలవరం నిర్వాసితుల కాలనీల అభివృద్ది గురించి సిఎం ప్రశ్నలకు అధికారులు జవాబిస్తూ ఇప్పటివరకు 15 కాలనీల అభివృద్ధి పూర్తయిందని, మరో 38 కాలనీల్లో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని అధికారులు సిఎంకు వివరించారు. ఇప్పటివరకు పూర్తయిన 15 కాలనీల్లో 3,348 నిర్వాసిత కుటుంబాలు నివాసం ఉంటున్నాయని చెప్పారు. ఉభయ గోదావరి జిల్లాల్లో "పునరావాసం-పరిహారం" ప్యాకేజ్ కింద నిర్వాసితుల కోసం చేపట్టిన కాలనీల అభివృద్ధిని త్వరితగతిన పూర్తిచేయాలని ఈ సందర్భంగా అధికారులకు సిఎం చంద్రబాబు నిర్దేశించారు. అలాగే టెండర్ల దశలో ఉన్న మరో 7 కాలనీల పనులను మే నెల మొదటివారంలోనే ప్రారంభించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Amaravathi:AP Chief Minister N Chandrababu Naidu will visit on April 23 and inspect the ongoing Polavaram project works. CM Chandrababu Naidu on Monday urged his officials to send letters to Union Water resources minister Nitin Gadkari and Finance minister Arun Jaitley so that funds can be disbursed at the earliest in order to speed up the Polavaram project.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more