చంద్రబాబు ఆకస్మిక తనిఖీ: అధికారులకు కీలక ఆదేశాలు జారీ
Heavy rains in AP: ఏపీని వణికించిన వాయుగుండం తీరం దాటింది. శనివారం అర్ధరాత్రి 12: 30 నుంచి 2:30 గంటల మధ్య తీరాన్ని తాకింది. శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం సమీపంలో తీరాన్ని తాకింది. అనంతరం బలహీనపడింది. అయినప్పటికీ- వచ్చే 24 గంటల పాటు రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావ ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఏపీలో అతి భారీ వర్షాలు పడుతున్నాయి. ప్రత్యేకించి- కృష్ణా, గుంటూరులను ముంచెత్తాయి. రాజధాని అమరావతి ప్రాంతం మొత్తం మునకేసింది. చెరువును తలపిస్తోంది. విజయవాడలో వరద.. విలయతాండవం చేసింది. అనేక ప్రాంతాలు నీటమునిగాయి.

ఈ పరిణామాల మధ్య ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. ఏపీ ఏపీ విపత్తు నిర్వహణ విభాగం కార్యాలయాన్ని సందర్శించారు. ఆ సమయంలో ఆయన వెంట హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్, జల వనరుల మంత్రిత్వ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జీ సాయి ప్రసాద్, ఇతర అధికారులు ఉన్నారు.
ఏ రిజర్వాయర్ నుంచి ఎంత మేర వరదనీరు విడుదల అవుతుందనే విషయంపై స్పష్టత ఉండాలని అన్నారు. పులిచింతల నుంచి ప్రకాశం బ్యారేజీ మధ్య ఉన్న 90 కిలోమీటర్ల దూరంలో ఏర్పాటు చేసిన గేజ్‌ల ద్వారా, రియల్ టైమ్ ఆధారంగా వరద ప్రవాహాన్ని ఖచ్చితంగా లెక్కించాలని సూచించారు.
కృష్ణా, గోదావరి నదుల పరీవాహక ప్రాంతాలకు సంబంధించిన మ్యాప్‌లను ముందుగానే సిద్ధం చేసుకున్నారా? అంటూ విపత్తు నిర్వహణ విభాగం అధికారులను ప్రశ్నించారు. దానికి వారు సానుకూలంగా స్పందించారు. ప్రస్తుతం కృష్ణానది నుంచి 5,75,000 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల అవుతోందని వివరించారు.
పులిచింతల, నాగార్జునసాగర్ వంటి రిజర్వాయర్ల నుంచి విడుదల చేస్తోన్న వరద నీటిని తక్కువ పరిమాణంలో విడుదల చేయగలిగితే విజయవాడ, గుంటూరు, రాజధాని అమరావతి సహా రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల వల్ల స్తంభించిపోయిన వరదనీరు అటు ప్రవహిస్తుందని చంద్రబాబు అంచనా వేశారు.

ఇక్కడ నిల్వ ఉన్న వరదనీరు అటు ప్రవహించిన తరువాత రిజర్వాయర్ల నుంచి ఎంత కావాలంటే అంత విడుదల చేసుకోవచ్చని చంద్రబాబు చెప్పారు. ఆనకట్టకు ఎలాంటి విఘాతం కలగకుండా నీటిని విడుదల చేయాలన్నదే తన ఉద్దేశమని వివరించారు. అదే సమయంలో వరదనీరు కూడా ఎక్కడా నిల్వ ఉండకూడదని పేర్కొన్నారు.
అంతకుముందు- వరద స్థితగతులపై హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత విపత్తు నిర్వహణ విభాగం కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. వర్షాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోని అధికారులతో ఫోన్ లో మాట్లాడి పరిస్థితులు తెలుసుకున్నారు. అవసరమైన చోట్ల సహాయక చర్యల కోసం యంత్రాంగం సిద్ధంగా ఉంచామని తెలిపారు.












Click it and Unblock the Notifications