భువనమ్మ మరో అరుదైన ఘనత.. సీఎం చంద్రబాబు ప్రశంసలు !!
ఏపీ సీఎం నారా చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ప్రతిష్ఠాత్మక పురస్కారం దక్కించుకున్నారు. ప్రస్తుతం ఆమె హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నారా భువనేశ్వరికి ఇండియన్ డెయిరీ అసోసియేషన్ (సౌత్ జోన్) ప్రతిష్టాత్మక 'అవుట్‌స్టాండింగ్ డెయిరీ ప్రొఫెషనల్' అవార్డును ప్రదానం చేసింది. డెయిరీ రంగంలో ఎన్నో ఏళ్లుగా చేస్తున్న విశేష సేవలు, రైతు కేంద్రిత విధానాలకు గుర్తింపుగా ఈ పురస్కారం లభించింది. దీంతో ఈ విషయం ఏపీ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
అవార్డు అందుకున్న అనంతరం నారా భువనేశ్వరి ఇండియన్ డెయిరీ అసోసియేషన్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఈ పురస్కారాన్ని ఆంధ్రప్రదేశ్‌లోని వేలాది మంది పాడి రైతులకు అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు. రైతుల సహకారం లేకుండా ఈ స్థాయి సాధ్యం కాదని పేర్కొన్నారు. డెయిరీ రంగ అభివృద్ధి, నాణ్యమైన పాల ఉత్పత్తులు, రైతుల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా భవిష్యత్తులో కూడా నిరంతరం కృషి చేస్తానని ఆమె స్పష్టం చేశారు.

కాగా డెయిరీ పరిశ్రమలో నాణ్యత, పారదర్శకత, సుస్థిర అభివృద్ధిని ప్రోత్సహిస్తూ హెరిటేజ్ ఫుడ్స్‌ను దేశవ్యాప్తంగా విశ్వసనీయ బ్రాండ్‌గా నిలిపేందుకు భువనేశ్వరి కీలక పాత్ర పోషించారు. పాడి రైతులకు న్యాయమైన ధరలు, సమయానికి చెల్లింపులు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందించడం ద్వారా వారి ఆదాయం పెరిగేలా చర్యలు చేపట్టారు. మహిళా సాధికారతను డెయిరీ రంగంతో అనుసంధానిస్తూ ప్రత్యేక కార్యక్రమాలను అమలు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలను స్వయం ఉపాధి దిశగా నడిపిస్తూ, పాల ఉత్పత్తి, ప్రాసెసింగ్, మార్కెటింగ్‌లో వారికి శిక్షణ ఇచ్చి ఆర్థికంగా బలోపేతం చేశారు. ఈ ప్రయత్నాలు మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచాయని డెయిరీ నిపుణులు ప్రశంసిస్తున్నారు.
సీఎం చంద్రబాబు అభినందనలు..
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన సతీమణి భువనేశ్వరిని హృదయపూర్వకంగా అభినందించారు. పాడి రైతుల అభ్యున్నతి, మహిళల సామాజిక-ఆర్థిక పురోగతికి ఆమె చేస్తున్న కృషి స్ఫూర్తిదాయకమని తెలిపారు. ఈ అవార్డు భువనేశ్వరి వ్యక్తిగత కృషికే కాదు, ఆమెతో కలిసి పనిచేస్తున్న మొత్తం బృందానికి దక్కిన సరైన గుర్తింపని వ్యాఖ్యానించారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌లోని వేలాది మంది పాడి రైతుల కష్టపడి చేసిన శ్రమను కూడా ఈ పురస్కారం ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు.
Proud of you, Bhuvaneswari! Congratulations to you and the entire team on this well-deserved recognition. This honor truly belongs to the thousands of dairy farmers of Andhra Pradesh who made it possible. Your hard work and dedication toward uplifting dairy farmers and empowering… https://t.co/8yPav10pwB
— N Chandrababu Naidu (@ncbn) January 10, 2026
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్‌స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్












Click it and Unblock the Notifications