సెల్ఫ్ మార్కెటింగ్‌లో చంద్రబాబు దిట్ట: అంబటి, ‘తోటపల్లి’ని జాతికి అంకితం చేయనున్న చంద్రబాబు

అమరావతి: నదుల అనుసంధానం పూర్తైపోయిందని ఏపీ సీఎం చంద్రబాబు గొప్పులు చెప్పుకంటున్నారని వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. తనను తాను మార్కెట్ చేసుకోవడంలో చంద్రబాబు నెంబర్ వన్ అని అన్నారు.

జరిగింది నదలు అనుసంధానం కాదని, టీడీపీ ఆఫీసుకు నిధుల అనుసంధానం జరిగిందని విమర్శలు చేశారు. సాగునీటి ప్రాజెక్టులు చిత్తశుద్ధితో పూర్తి చేసిన చరిత్ర చంద్రబాబుకు లేదని మండిపడ్డారు. తోటపల్లి ప్రాజెక్టును ఏనాడు చంద్రబాబు పట్టించుకోలేదన్నారు.

తోటపల్లి ప్రాజెక్టును పూర్తి చేయడానికి దివంగత సీఎం వైయస్ రాజశేఖరరెడ్డి పట్టుదలతో కృషి చేశారన్నారు. ఎవరో పూర్తి చేసిన ప్రాజెక్టులను తాను పూర్తి చేశానని చంద్రబాబు చెప్పుకోవడం సిగ్గుచేటు అని తెలిపారు. పులిచింతల ప్రాజెక్టును కూడా తానే పూర్తి చేశానని చంద్రబాబు అనడం విడ్డూరంగా ఉందన్నారు.

cm chandrababu number one in self marketing says ambati rambabu

తెలుగు ప్రజలకు ఎంతగానో ఉపయోగపడే పోలవరాన్ని పక్కన పెట్టి పట్టిసీమ ప్రాజెక్టు తెరపైకి తెచ్చారని ధ్వజమెత్తారు. పంపులు లేకుండానే పట్టిసీమ ప్రాజెక్టును ఎలా జాతికి అంకితం చేశారని ప్రశ్నించారు. కల్లబొల్లి మాటలతో ప్రజలను సీఎం చంద్రబాబు మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు.

‘తోటపల్లి'ని జాతికి అంకితం చేయనున్న సీఎం చంద్రబాబు

సీఎం చంద్రబాబు నాయుడు చేపట్టిన ‘చంద్రన్న యాత్ర' పశ్చిమ గోదావరి జిల్లాలోని ద్వారకా తిరుమల చేరుకుంది. ద్వారకాతిరుమలలో వెంకటేశ్వరస్వామిని చంద్రబాబు దర్శించుకోనున్నారు. అనంతరం అక్కడ నూతంగా ఏర్పాటు కానున్న ఓ ఆసుపత్రికి ఆయన భూమి పూజ చేయనున్నారు.

ఆ తర్వాత శ్రీకాకుళం జిల్లాలోని తోటపల్లి ప్రాజెక్టుకు సీఎం చంద్రబాబు నాయుడు చేరుకుంటారు. జలయజ్ఞంలో భాగంగా దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రప్రథమంగా ప్రారంభించిన తోటపల్లి ప్రాజెక్టు 12 ఏళ్లకు పూర్తి అయ్యింది. ఈ ప్రాజెక్టును చంద్రబాబు నేడు జాతికి అంకితం చేయనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+