ప్రత్యేక హోదాపై పూటకో మాట, పవన్‌తో కలిసి చంద్రబాబు నాటకాలు: శిల్పా చక్రపాణి రెడ్డి
కర్నూలు: ప్రత్యేక హోదాపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూటకో మాట మాట్లాడుతూ ప్రజలను మోసం చేస్తున్నారని వైఎస్సీర్సీపీ నాయకుడు శిల్పా చక్రపాణి రెడ్డి మండిపడ్డారు. సోమవారం ఆయన కర్నూలులో మీడియాతో మాట్లాడుతూ ప్రత్యేక హోదాపై జగన్‌కు క్రెడిట్ దక్కకూడదనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్‌తో కలిసి చంద్రబాబు నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు.
Recommended Video

మొదటి నుంచి ప్రత్యేక హోదా సాధించడం కోసం అనేక కార్యక్రమాలు చేసిన ఘనత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిదేనని, పవన్ కళ్యాణ్‌ది మిడిమిడి జ్ఞానమని వ్యాఖ్యానించారు. రాజకీయలంటే సినిమాలు తీసినంత ఈజీ కాదంటూ చక్రపాణి రెడ్డి ఎద్దేవా చేశారు.

మార్చి ఒకటో తేదీన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టబోయే కలెక్టరేట్ల ముట్టడిని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. తెలుగు ప్రజల మనోభావాలు, ఆకాంక్షలు ఢిల్లీలో వినిపిద్దాం.. ప్రత్యేక హోదా సాధిద్దాం.. అంటు చక్రపాణిరెడ్డి నినాదం ఇచ్చారు.
మార్చి మూడో తేదీన పార్టీ ఎమ్మెల్యేలు, ఇంచార్జ్‌లు, ముఖ్యనాయకులంతా జగన్ మోహన్ రెడ్డిని కలిసి, అయిదో తేదీన ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద మహాధర్నాలో పాల్గొంటామని తెలిపారు.












Click it and Unblock the Notifications