అనంతపురం ఘటనపై సీఎం చంద్రబాబు రియాక్ట్.. ఉపేక్షించేది లేదంటూ వార్నింగ్ !
టాలీవుడ్ స్టార్ హీరో, టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ మనవడు.. జూనియర్ ఎన్టీఆర్‌పై అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించినట్టు సమాచారం. పార్టీకి చెడ్డపేరు వచ్చే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశారని అంటున్నారు.
ఈ మేరకు పార్టీ ముఖ్య నేతలతో అమరావతిలో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో సూపర్ సిక్స్ పథకాల అమలు, ప్రజల స్పందనతో పాటు ఇటీవల చోటుచేసుకున్న వివాదాస్పద ఘటనలు ప్రధాన చర్చకు వచ్చాయని చెబుతున్నారు.

అనంతపురం ఎమ్మెల్యే వ్యాఖ్యలపై అసహనం..
కాగా అనంతపురం ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు పార్టీ ఇమేజ్‌కి తీవ్ర నష్టం చేస్తాయని సీఎం అభిప్రాయపడ్డారని పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. చిన్నపాటి విమర్శలు కూడా ప్రతిపక్షానికి ఆయుధాలుగా మారుతాయని గుర్తుచేశారు. భవిష్యత్తులో ఇలాంటి తప్పులు పునరావృతం కాకుండా క్రమశిక్షణా చర్యలకు వెనుకాడబోమని హెచ్చరించారు. సంబంధిత ఘటనలో తప్పు లేకపోయినా.. తప్పుడు ప్రచారం జరుగుతుంటే వెంటనే బయటకు వచ్చి ప్రజలకు వాస్తవాలు చెప్పాల్సిన అవసరం ఉందని నేతలకు సీఎం చంద్రబాబు సూచించారు.
ఆముదాలవలస, గుంటూరు ఈస్ట్ ఘటనలపై ఆగ్రహం..
అంతే కాకుండా ఆముదాలవలస, గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యేలపై వస్తున్న వార్తా కథనాలు కూడా సీఎం దృష్టికి వచ్చాయని అంటున్నారు. ఈ విషయంలో ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారని.. వ్యక్తిగత చర్యలు పార్టీకి చెడ్డపేరు తెచ్చే పరిస్థితులు సృష్టిస్తే పార్టీ కఠినంగా వ్యవహరించాల్సి వస్తుందని నేతలకు దిశానిర్దేశం చేశారని చెబుతున్నారు. గ్రూపు తగాదాలు, వ్యక్తిగత విభేదాలు వల్ల పార్టీకి నష్టం చేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని సీఎం అన్నారట. ప్రతి నాయకుడు పార్టీ గౌరవాన్ని కాపాడేలా ప్రవర్తించాలని సూచించారట.

మరోవైపు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అందిస్తున్న స్త్రీశక్తి పథకం రాష్ట్రవ్యాప్తంగా అద్భుత స్పందన తెచ్చుకుందని సీఎం పేర్కొన్నారు. ఈ విజయాన్ని జీర్ణించుకోలేని వైసీపీ, తమ అనుబంధ మీడియాతో కలిసి తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించారు. అందుకే ప్రతి నాయకుడు వెంటనే ప్రజల్లోకి వెళ్లి వాస్తవాలను తెలియజేయాలని అన్నారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ సిక్స్ పథకాలు భారీ విజయాన్ని సాధిస్తున్నాయని చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు.
ఇక అన్నదాత సుఖీభవ పథకం అమలులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ర్యాలీలు, కార్యక్రమాలపై సీఎం ఆరా తీసినట్టు నేతలు పేర్కొన్నారు. పథకాల అమలులో ఎమ్మెల్యేలు, మంత్రులు యాక్టివ్ గా పాల్గొనాలని సీఎం ఆదేశించారు. ప్రజలతో మమేకమై, వారి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోవాలని అప్పుడే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని అన్నారు.
-
ఆసుపత్రిలో సోనియా గాంధీ అడ్మిట్: హుటాహుటిన రాహుల్, ప్రియాంక: అబ్జర్వేషన్ లో -
తమిళనాడులో పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం.. విజయ్ కు బిగ్ షాక్..? -
అసెంబ్లీ తీర్మానం వేళ 'అమరావతి'పై తేల్చేసిన జగన్, గతం గతః- సంచలన ప్రకటన..!! -
కవిత కొత్త పార్టీకి ముహూర్తం ఫిక్స్.. రామయ్య ఆశీస్సులతో.. -
కేంద్రానికి కవిత షాకింగ్ అల్టిమేటం.. ఆ విషయంలో పోరాటమే! -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..!












Click it and Unblock the Notifications